ట్విట్టర్ ఫౌండర్ ఎలాన్ మస్క్ గురించి తెలిసిన వాళ్లకి అతని మాజీ భార్య తలులా రిలే గురించి కూడా తెలిసే ఉంటుంది. వీళ్లిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. ఇప్పడామె ఓ పాపులర్ యాక్టర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ థామస్ బ్రాడీ సాంగ్స్టర్తో ఏడడుగులు వెయ్యనుంది.
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య విడాకుల వ్యవహారం అనేది కొనసాగుతూనే ఉంది. మరోవైపు డేటింగ్ చేసే వాళ్లు, బ్రేకప్ చెప్పుకుంటున్న వాళ్లు, ప్రపోజ్, నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. రీసెంట్గా ట్విట్టర్ ఫౌండర్ ఎలాన్ మస్క్ గురించి తెలిసిన వాళ్లకి అతని మాజీ భార్య తలులా రిలే గురించి కూడా తెలిసే ఉంటుంది. వీళ్లిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. ఇప్పడామె ఓ పాపులర్ యాక్టర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ థామస్ బ్రాడీ సాంగ్స్టర్తో ఏడడుగులు వెయ్యనుంది.
వీరిద్దరూ గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ఇక తనకు నిశ్చితార్థం జరిగినట్లు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది రిలే. మాజీ భార్య మరో పెళ్లికి సిద్ధమవుతుందని తెలిసి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్ ఎమోజీతో కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇక థామస్ కూడా తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కన్ఫమ్ చేశాడు.
2021లో డేటింగ్ స్టార్ట్ చేశామని, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లెప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. అంతకుముందు ఎలాన్ మస్క్ – తలులా రిలే రెండేళ్ల డేటింగ్ తర్వాత స్కాట్లాండ్లోని డోర్నోచ్ కేథడ్రల్ (చర్చి)లో వివాహం చేసుకున్నారు. 2016 విడాకులు తీసుకున్నారు. తలులా కంటే ముందు జస్టిన్ విల్సన్‌ను మ్యారేజ్ చేసుకుని, 2008లో ఆమెతో విడిపోయారు మస్క్.
Very happy to share that after two years of dating, Thomas Brodie Sangster and I are engaged! pic.twitter.com/NipyXtsDV0
— Talulah Riley (@TalulahRiley) July 27, 2023