ఎలన్ మస్క్ రోబోట్లను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోలపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఎలన్ మనిషి కాదని ఓ గ్రహాంతర వాసి అని పేర్కొన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన వాట్సాప్ సేవల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ ద్వారా యూజర్ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ కూడా వాట్సాప్ ని నమ్మకూడదు అంటూ ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో మంది యూజర్లు ఉన్నారు. అయితే వాట్సాప్ సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రశ్నలు, ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా దానిని ఎలన్ మస్క ట్వీట్ చేస్తూ వాట్సాప్ ని నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ ఖాతాదారులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ట్విట్టర్ బ్లూ అని షాకిచ్చారు. ఇప్పుడు అందరికీ గట్టి షాక్ తగిలే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎలన్ మస్క్ నిర్ణయం ప్రకారం లక్షల్లో ఖాతాలు గల్లంతైపోతాయి.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాదిరే ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని ప్రకటించాడు. ఆ వివరాలు..
ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత చాలానే మార్పులు చేసుకొచ్చారు. వాటిలో ట్విట్టర్ బ్లూ టిక్ కు డబ్బు కట్టాలని కోరడం కూడా ఒకటి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు వారి బ్లూ టిక్ కోసం డబ్బు చెల్లించారు. కానీ, భారత్ లో మాత్రం చాలా మంది సెలబ్రిటీలు టిక్ పోయినా.. అలా డబ్బు కట్టేందుకు ససేమిరా అంటున్నారు.
మొదటి నుంచి ఎలాన్ మస్క్ కొంచెం తిక్క మనిషి. తనకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ మావ బాగా నష్టాల్లో కూరుకుపోయాడు. తన సంపాదన చాలా వరకూ కరిగిపోయింది. దీంతో ట్విట్టర్ ని కొన్న పాపానికి డబ్బులు రాబట్టుకోవాలని బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తా అని చెప్పాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో తిక్కరేగి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ ని తొలగించాడు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.
స్పేస్ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ 'స్టార్షిప్' ప్రయోగం విఫలమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్.. ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది.
ఆ మధ్య హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ ఒకే ఒక్క నివేదికతో టాప్ పొజిషన్ లో అదానీని పాతాళానికి పడిపోయేలా చేశాడు. తాజాగా ఒక యువకుడు ఏకంగా ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ వంటి వారిని తీసుకొచ్చి మురికివాడలో పడేశాడు. అయితే నాథన్ ఆండర్సన్ కి, ఈ యువకుడి చాలా తేడా ఉంది.