ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఫేస్‌బుక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కొంపముంచింది. దీంతో ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్ నికర విలువ 29 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.2 లక్షల కోట్ల పైమాటే) కోల్పోయాడు.
మెటా షేరు గురువారం (ఫిబ్రవరి 3) 26% పతనమై 240 డాలర్లకు చేరువ కావడంతో, ఆ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. ఒక రోజులో ఒక అమెరికా కంపెనీ ఈ స్థాయిలో సంపదను కోల్పోవడం ఇదే మొదటిసారి. శుక్రవారమూ మెటా షేరు మరో 2% నష్టపోయి 233 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ కంపెనీలో 12.8% వాటా కలిగి ఉన్న జుకర్ బర్గ్ నికర సంపద విలువ 29 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.18 లక్షల కోట్ల) మేర తగ్గి 84.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6,36,000 కోట్లు) పరిమితమైందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా వెల్లడిస్తోంది.
#Zuckerberg is in the twelfth spot on Forbes’ list of real-time billionaires, below Indian business moguls #MukeshAmbani and #GautamAdani
Watch video for details pic.twitter.com/5SwKj77x5O
— Hindustan Times (@htTweets) February 4, 2022
జుకర్‌బర్గ్‌ను దాటేసిన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ
ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘రియల్-టైమ్ బిలియనీర్ల’ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. గౌతమ్ అదానీ సంపద 637 మిలియన్ డాలర్లు పెరిగి 91.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,81,000 కోట్లు) కాగా.. ముకేశ్ అంబానీ సంపద విలువ 89.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.6,70,000 కోట్లు) ఉంది. ఒక్కరోజులో జుకర్‌బర్గ్ దాదాపు 2 లక్షలు కోట్లు కోల్పోవడంతో ఆయన 12వ ర్యాంక్ కు పడిపోగా, గౌతమ్ అదానీ 10, ముకేశ్ అంబానీ 11వ ర్యాంకులతో అయన కంటే ముందున్నారు.
#MarkZuckerberg lost $29 billion in net worth as Meta’s stock marked a record one-day plunge
With this, Zuckerberg is in the twelfth spot on Forbes’ list of real-time billionaires, below Indian business moguls #MukeshAmbani and #GautamAdani
Read more – https://t.co/5Y1aiwn4E1 pic.twitter.com/tDUa2I0VXx
— Hindustan Times (@htTweets) February 4, 2022
బెజోస్ సంపద పైపైకి
ఒకవైపు జుకర్‌బర్గ్ వరుసగా లక్షల కోట్ల సంపదను కోల్పోగా..మరోవైపు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద మాత్రం లక్షల కోట్ల స్థాయిలో పెరిగింది. అమెజాన్ ఆశాజనక ఫలితాలు ప్రకటించడంతో జెఫ్ బెజోస్ సంపద 20 బిలియన్ డాలర్లు(రూ.1.50 లక్షల కోట్లు) పెరిగింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో బెజోస్‌కు 9.9 శాతం వాటా ఉన్నది.