జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ప్యాక్ లపై ఫైవ్ స్టార్ చాక్లెట్లను అతికించి కస్టమర్లకు పంచాడు. సొంత డబ్బులతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్ ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక కొందరు, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరికొందరు పలు ఫుడ్ డెలివరీ సంస్థల్లో చేరి ఉపాధి పొందుతున్నారు. నగరంలో చాలామంది జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థల్లో డెలివరీ బాయ్స్ గా చేరి ఉపాధి పొందుతున్నారు. కాగా ఓ జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ఆర్డర్ పై ఫైవ్ స్టార్ చాక్లెట్ ను అతికించి కస్టమర్లకు పంచాడు. తన సొంత డబ్బుతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్ప్రైజ్ చేశాడు. డెలివరీ బాయ్ చేసిన ఈ చాక్లెట్ల పంపిణీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ తో జొమాటో డెలివరీ బాయ్ ను మెచ్చుకుంటున్నారు. అసలు డెలివరీ బాయ్ చాక్లెట్స్ ఎందుకు పంచాడు? దానికి గల కారణం ఏంటీ అనే విషయాలు మీ కోసం..
కరణ్ ఆప్టే అనే వ్యక్తి జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. అయితే పుట్టిన రోజు వేడుకను కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందరికీ స్వీట్స్ పంచి ఆనందంగా గడుపుతారు. కానీ కరణ్ ఆప్టే మాత్రం కొంత విభిన్నంగా ఆలోచించి తన పుట్టిన రోజును స్పెషల్ గా క్రియేట్ చేసుకున్నాడు. తను చేస్తున్న ఫుడ్ డెలివరీ ప్యాక్ లపై ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అతికించి కస్టమర్లకు పంచాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సొంత డబ్బులు వెచ్చించి ఫైవ్ స్టార్ చాక్లెట్లను కొనుగోలు చేశాడు. డెలివరీ చేసిన ప్రతి ప్యాక్ పై చాక్లెట్లను అతికించి కస్టమర్లకు పంచాడు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీ ద్వారా నెటిజన్స్ తో పంచుకున్నాడు. డెలివరీ బాయ్ కరణ్ ఆప్టె గొప్ప మనసుకు మెచ్చుకుంటూ, ఇక ఇప్పుడు జొమాటో ఆ డెలివరీ బాయ్ కు గిఫ్ట్ అందించాలంటూ కామెంట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో ఆ డెలివరీ బాయ్ కి కేక్ పంపించి సర్ప్రైజ్ చేసింది.