పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఎట్టకేలకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం చివరి నుండి చూసుకుంటే బంగారం ధర వరుసగా పెరుగుతూనే వచ్చింది. ఈ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు నిదానంగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఈ ఎఫెక్ట్ దిగుమతులపై కూడా పడింది. ఈ కారణంగానే బంగారం ధరలో మార్పు వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.210 పడిపోయింది. రూ.48,560కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 క్షీణించింది. దీంతో రేటు రూ.44,500కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా గోల్డ్ రేట్ తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1817 డాలర్లకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిన విషయమే. వీటిల్లో ఎక్కువ అంశాలు మార్కెట్ డౌన్ ఫాల్ నే సూచిస్తున్నాయి. దీనితో.. బంగారం కొనుక్కోవడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. సరిగ్గా అక్షయ తృతీయ ముందే ఇలా బంగారం ధర తగ్గడంతో సామాన్య కొనుగోలుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.