దేశంలోస్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా చాలా పనులను స్మార్ట్‌ఫోన్ సాయంతో చక్కబెట్టుకునే వెసులుబాటు దొరికింది. సినిమాలు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేయాలన్నా.. రీఛార్జులు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, పిల్లాడి స్కూల్ ఫీజులు,.. ఇలా ఒకటేంటి.. ప్రతీది అరచేతిలో స్మార్ట్‌ఫోన్ నుంచే కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డేటా వినియోగానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌కు తగినట్లే టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్స్‌లో రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జియో 1జీబీ డేటా ప్లాన్స్
రూ.149 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులు. ప్రతిరోజూ 1జీబీ డేటా చోప్పున.. 20 రోజులకు 20 జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.179 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. ప్రతిరోజూ 1జీబీ డేటా చోప్పున.. 24 రోజులకు 24 జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.209 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజూ 1జీబీ డేటా చోప్పున.. 28 రోజులకు 28 జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
jio 1GB plans pic.twitter.com/CzowZgrxBP
— Govardhan Reddy (@gova3555) April 19, 2022
జియో 1.5జీబీ డేటా ప్లాన్స్
రూ.119 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా చోప్పున.. 14 రోజులకు 21 జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా చోప్పున.. 23 రోజులకు 34.5జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.239 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా చోప్పున.. 28 రోజులకు 42జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.259 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా చోప్పున పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
jio 1.5 GB plans pic.twitter.com/yepO4P211V
— Govardhan Reddy (@gova3555) April 19, 2022
జియో 2జీబీ డేటా ప్లాన్స్
రూ.249 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా చోప్పున.. 23 రోజులకు 46జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
రూ.299 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా చోప్పున.. 28 రోజులకు 56జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.
jio 2 GB plans pic.twitter.com/oivvP6zLYi
— Govardhan Reddy (@gova3555) April 19, 2022
ఎయిర్‌టెల్ 1జీబీ/1.5జీబీ డేటా ప్లాన్స్
రూ. 209 ప్లాన్: ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజులు. రోజుకు 1జీబీ డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ పొందవచ్చు.
రూ. 239 ప్లాన్: ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. ప్రతిరోజూ 1జీబీ ఇంటర్నెట్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ కూడా పొందుతారు.
రూ. 265 ప్లాన్: ఈ ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1జీబీ డేటా పొందుతారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ కూడా పొందుతారు.
రూ. 299 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా చోప్పున.. 28 రోజులకు 42జీబీ డేటా పొందుతారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ పొందవచ్చు.
గమనిక: ఇవన్నీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గమనించగలరు.