బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే రొటీన్‌కి భిన్నంగా ఆ రెండు ఎపిసోడ్లలో నాగార్జన ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు హౌస్‌లో ఆడుతున్నారా? చిల్ అవ్వడానికి వచ్చారా అంటూ 9 మందిని సోఫా వెనక నిల్చోబెట్టి కడిగిపారేశాడు. ఆ క్లాస్ తర్వాత హౌస్ మేట్స్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ఆటలో దూకారు. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో అంతా ఇరగదీశారు. అవకాశం లేకపోయినా సరే కష్టపడి గొడవలు పెట్టేసుకున్నారు. గెలవడం కోసం నానా తిప్పలు పడ్డారు. చివరికి పోలీసు టీమ్ గెలిచింది. ఆ టీమ్‌కు నాయకుడిగా వ్వవహరించిన ఆదిరెడ్డి తర్వాత టాస్కులో పోటీపడి కెప్టెన్ కూడా అయ్యాడు.
ఇంక ఈ వారం నాగార్జున వచ్చి తమను ఎంతో పొగిడేస్తాడంటూ ఎదురు చూసిన హౌస్ మేట్స్ కు ఆశాభంగం కలిగింది. ఎందుకంటే గత వారం వెనక్కి పంపిన 9 మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిని మళ్లీ సోఫా వెనక్కి పంపారు. ఈ వారం మీరు పర్ఫామ్ చేశామని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అయితే శ్రీహాన్, శ్రీ సత్యలు బాగా ఆడారంటూ నాగార్జున సోఫాలో కూర్చోవాల్సిందిగా కోరాడు. శ్రీహాన్, శ్రీ సత్య ఇద్దరూ వెళ్లి సోఫాలో కూర్చొన్నారు. అయితే మిగిలిన ఐదుగురిపై నాగ్ ఫైర్ అయ్యాడు. కనీసం శ్రీహాన్- శ్రీ సత్యలకు చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారా అంటూ ప్రశ్నించాడు. శభాష్ అనిపించుకుని వెళ్తున్న వారికి చప్పట్లు కూడా కొట్టలేరా అన్నట్లుగా ఫైర్ అయ్యాడు.
అయితే ఎప్పటిలాగానే బాలాదిత్య అందుకుని నాగార్జున ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అంటే సోఫా వెనుకే ఉండిపోయామనే షాక్‌లో అలా చప్పట్లు కొట్టకుండా ఉండిపోయా సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. బాలాదిత్య ఆన్సర్ విన్న నాగార్జున అతని సమాధానంతోనే కౌంటర్ వేశాడు. నీ ఆట తీరు చూసి మేం కూడా షాక్‌లో ఉండిపోయాం అంటూ సెటైర్ వేశాడు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ ఇనయా సుల్తానా గొడవ సమయంలో బాలాదిత్య మౌనంగా చూస్తూ కూర్చున్న వీడియో ప్లే చేశారు. అందుకు బాలాదిత్య నేను ప్లేయర్లా కాకుండా ఒక మనిషిలా స్పందించానంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు బాలాదిత్య గారడి మాటలకు మీరు కన్విన్స్ అవుతున్నారా అంటూ ప్రేక్షకులను అడగ్గా వాళ్లు లేదంటూ సమాధానం చెప్పారు. అయితే ఈ వారం కూడా నాగ్ ఫుల్ ఫైర్ మీద ఉండేటట్లు కనిపిస్తోంది. బాలాదిత్యకు ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.