బిగ్ బాస్ అంటే గొడవలు ఎంత కామనో.. జోడీలు కూడా అంతే కామన్. తెలియని వాళ్లయితే మాట్లాడి, కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ హౌసులో రాకముందే తెలుసుంటే మాత్రం ఆ పని చాలా సులభమైపోతుంది. ఈ షోలో జోడీలు అనే ప్రస్తావన వస్తే రాహుల్-పునర్నవి, షన్ను-సిరి జోడీలే ముందు గుర్తొస్తాయి. ఇప్పుడు వాళ్ల జాబితాలోకి చేరాలని.. ఈ సీజన్ లోని ఓ జోడీ తెగ ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఎవరా వాళ్లు.. ఏంటా కథ!? ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒకే న్యూస్ ఛానెల్లో కలిసి పనిచేసిన ఆర్జే సూర్య, ఆరోహి, ఈసారి బిగ్ బాస్ హౌసులో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు.
తొలివారం.. ఆర్జే సూర్య-ఆరోహి చాలా నార్మల్ గానే ఉన్నారు. ఓవైపు సూర్య, కీర్తి భట్ తో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. స్పూన్ తో భోజనం తినిపించడం, ఆమె ఏదైనా చెబుతుంటే వినడం లాంటివి చేశాడు. అది వర్కౌట్ కాకపోయేసరికి సూర్య-కీర్తి పులిహోరకు అప్పుడే పుల్ స్టాప్ పడింది. మరోవైపు ఆరోహి కూడా.. 20 ఏళ్లు ఒంటరిగానే బతికానని, ఈ లవ్వులు గట్రా తనకు పడవని గట్టిగానే చెప్పింది. కట్ చేస్తే.. సూర్య-ఆరోహినే ప్రస్తుతం జోడీ అయిపోయారు. హౌసులో తెగ కెమిస్ట్రీ పండించడానికి ట్రై చేస్తున్నారు.
ఇక శుక్రవారం ఎపిసోడ్ లో సూర్య-ఆరోహి సరసాలు పీక్స్ కి చేరాయి. వాళ్ల కవ్వింపులు, అర్ధరాత్రి ముచ్చట్లు చూస్తుంటే.. గత సీజన్ లో షన్ను-సిరినే గుర్తొస్తున్నారు. అలానే సూర్య.. ఫుడ్ కోసం దొంగతనం చేయడం, చాటుగా వంట చేసుకుని తినడం కాస్త సిల్లీగా అనిపించింది. ఓ సందర్భంలో.. ‘సూర్య నువ్వు మారిపోయావ్. బయట నువ్వు అరిస్తే సారీ చెప్తావ్.. ఇక్కడ సారీ చెప్పట్లే మరిచిపోయావ్’ అని ఆరోహి అంటుంటే సిరి-షణ్ముక్ నే గుర్తొస్తున్నారు. మరి వీళ్లు, ఆ జోడీని మరిపించేలా ఆడతారా.. మధ్యలోనే డ్రాపవుతారా అనేది చూడాలి. మరి సూర్య-ఆరోహి ట్రాక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆరోహీని హర్ట్ చేసిన ఆర్జే సూర్యా.. ఏం చేశాడంటే..?