బిగ్ బాస్ హౌసులో 21 మంది ఉంటే.. అందులో చాలామంది అస్సలు ప్రేక్షకులకు పరిచయమే లేదు. ఇక అందరికీ తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సింగర్ రేవంత్ మాత్రమే. గాయకుడిగా టాలెంట్ చూపించడమే కాదు పలు షోల్లో విన్నర్ గా, మెంటార్ గా ఉన్న రేవంత్.. ఎంటర్ టైన్ మెంట్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గడు. అలాంటి రేవంత్.. బిగ్ బాస్ హౌసులో ఉన్నాడనే సరికి చాలామంది కాన్స్ ట్రేషన్ మనోడిపైనే పడింది. కానీ రేవంత్ చేస్తున్న ఒక్కో పని కూడా అతడిని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ లో గీతూ తర్వాత అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ రేవంత్ అనిపించుకున్నాడు. ఆట విషయంలో రేవంత్ ని ఏ మాత్రం వంకపెట్టడానికి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో అతడి కోపమే అతడ్ని వెనకపడేలా చేస్తోంది. ఆవేశంలో నోరు జారుతున్న మాటలపై హౌసులో ఇప్పటికే పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇక కంటెస్టెంట్ గా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు గానీ ఎందుకో అది వర్కౌట్ కావట్లేదు. గత ఐదు సీజన్లలోనూ సింగర్స్ ఉన్నారు.. సందర్భానుసారం పాటలు పాడుతూ ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు.
ఈ సీజన్ లో రేవంత్ మాత్రం.. సింగర్ అనే విషయాన్నే పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు. ఏదో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు పాటలు పాడుతున్నాడు తప్ప హౌసులో మాత్రం అతడు కోప్పడటానికే టైమ్ సరిపోతుంది. తనదే రైట్ అనే ధోరణి చూపిస్తున్నాడు. అందుకే రేవంత్.. హౌసులో చాలామందికి టార్గెట్ అవుతున్నాడు. ఇక ఈ సీజన్ లోకి వచ్చిన రివ్యూయర్స్ ఆదిరెడ్డి, గీతూ కూడా శుక్రవారం ఎపిసోడ్ లో ఇదే మాట్లాడుకున్నారు. రేవంత్, టాప్-5లో ఉండటం కష్టమేనని మాట్లాడుకున్నారు.
మరోవైపు రేవంత్ స్ట్రాంగ్ కంటెండర్ కావడంతో ఓటింగ్ పర్సంటేజిలోనూ మనోడే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రేవంత్ లాంటి బలమైన కంటెస్టెంట్ ని బయటకు పంపేస్తే తాము సేవ్ కావొచ్చని చాలామంది అనుకుంటున్నారు. కానీ అతడు ఇప్పట్లో బయటకెళ్లి ఛాన్సే లేదు. ఎందుకంటే ఓటింగ్ లో రేవంత్ లాంటి బలమైన పర్సన్ ఉంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. తద్వారా షోపై కొద్దో గొప్పో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మరి రేవంత్ ప్రస్తుతం ఆటతీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రేవంత్ vs నేహా చౌదరి.. మిత్రులు- శత్రువులుగా ఎలా మారారంటే..?