సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకీ కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎన్టీఆర్-ఏఎన్నార్ జనరేషన్ తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్స్ కొద్ది సంవత్సరాల క్రితం మళ్లీ మొదలైంది. సీనియర్, యంగ్ హీరోలు కలిసి క్రేజీ మూవీస్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకీ కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎన్టీఆర్-ఏఎన్నార్ జనరేషన్ తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్స్ కొద్ది సంవత్సరాల క్రితం మళ్లీ మొదలైంది. సీనియర్, యంగ్ హీరోలు కలిసి క్రేజీ మూవీస్ చేస్తున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్స్ అంటే.. ఫిలిం వర్గాల వారితో పాటు ప్రేక్షకాభిమానుల్లోనూ భారీ అంచనాలుంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటుంటారు మేకర్స్. ఇక గెస్ట్ అప్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘స్టైల్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కాసేపు కనిపిస్తే కాసుల కనక వర్షం కురిసింది. ‘చింతకాయల రవి’ లో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాటలో కాలు కదిపితే థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’ నుంచి ‘వాల్తేరు వీరయ్య’ వరకు లిస్ట్ పెద్దదే అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఈమధ్య అతిథి పాత్రల ట్రెండ్ కూడా నడుస్తోంది. కథలో ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అయితే చాలు డ్యూరేషన్‌తో సంబంధం లేకుండా తెరపై మరో హీరోతో కలిసి కనిపించడానికి రెడీ అంటున్నారు స్టార్ హీరోలు. వాళ్లల్లో ప్రయోగాలు, కొత్తదనం కోసం ప్రయత్నించి సక్సెస్ అవడంలో ముందు వరుసలో ఉంటారు కింగ్ నాగార్జున. ఆయన పరిచయం చేసిన డైరెక్టర్స్, టెక్నీషియన్స్, నటీనటులను మరే హీరో ఇంట్రడ్యూస్ చెయ్యలేదు. ఇటీవల కెరీర్ పరంగా కాస్త వేగం తగ్గింది. అయితే ‘చిన్న బ్రేక్.. చిటికెలో వచ్చేస్తా’ అన్నట్లు.. కొంత గ్యాప్ తర్వాత సాలిడ్ లైనప్‌తో రాబోతున్నారు కింగ్.
ఇప్పుడో క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. దాదాపుగా కన్ఫమ్ అయిన ఓ క్రేజీ కాంబో గురించి ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కోలీవుడ్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. శేఖర్ దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. ఎట్టకేలకు స్క్రిప్ట్ లాక్ అయ్యింది. కట్ చేస్తే పూర్తి కథ సిద్ధమయ్యేసరికి ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా మారిపోయింది. ధనుష్‌తో కలిసి కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కింగ్ ఓకే చెప్పేశారట. కనిపించేది కాసేపే అయినా నాగ్ క్యారెక్టర్ సాలిడ్‌గా ఉంటుందని అంటున్నారు. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారు. డేట్స్ కుదిరితే రష్మిక మందన్నాను ధనుష్‌కి జోడీగా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
#Dhanush #SekharKammula pic.twitter.com/Zm864F6IJS
— Aakashavaani (@TheAakashavaani) July 25, 2023