ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహిచారు. కేబినెట్ పునఃవ్యవస్థీకరణ తర్వాత జగన్ టీమ్‌లోకి కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. రెండో దఫాలో మంత్రులైన వారంతా ఎంతో సంతోషంగా గవర్నర్, సీఎం జగన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా రెండోసారి కేబినెట్ లో ఛాన్స్ కొట్టేసింది. పార్టీకోసం కష్టపడే రోజాకు సముచిత స్థానం దక్కిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పుడూ జగనన్న అని ఆప్యాయంగా సంబోధించే రోజా.. మరోసారి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం జగన్ దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత జగన్ చేతిని ముద్దాడి తన అభిమానాన్ని వెల్లడించారు. తర్వాత గవర్నర్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోజా ప్రమాణస్వీకారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోజా ప్రమాణస్వీకారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.