చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక భవిష్యత్తు లేదనుకుని తన ఆలోచన మార్చుకున్నాడు చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో చిరంజీవి పరిస్థితి మొదటికి వచ్చింది. చివరికి ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమాలు చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల కాలంలో చిరంజీవి తన సేవా కార్యక్రమాలకు ఎక్కువ కవరేజ్ కోరుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్న వారికే కాక తన అభిమానులకు సైతం ఫోన్ చేసి ప్రతినిధులను పంపి సహాయం చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ విషయంలో విపరీతంగా మైలేజ్ వస్తుందని ఆశించారు కానీ రాకపోయేసరికి నిరాశపడ్డారు. తన సేవా నిరతిని ప్రజలు బాగా గుర్తించాలని మాత్రం చిరంజీవి కోరుకుంటున్నారు. తాను మళ్లీ రాజకీయాల్లో ఆక్టివ్ కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు. బాస్ ఇజ్ బ్యాక్ అనే పద్ధతిలో రావాలంటే పొలిటికల్ తన ఇమేజ్ మేకోవొర్ రావాలని కోరుకుంటున్నాం. అందుకే సేవా కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేందుకు ప్రత్యేకంగా పీఆర్ టీమ్ పెట్టుకున్నారు అని చెబుతున్నారు.