పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. తమ గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా ఆరాధించే వారు లక్షల్లో ఉన్నారు. సినిమాల్లో ఆయన క్రేజ్, రేంజ్ వేరు. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స్టామినా ఆయనది. ఫిలిం ఇండస్ట్రీలో కింగ్‌లా ఉండే పవన్ ప్రజలకు సేవ చేయాలని పాలిటిక్స్‌లోకి వచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. తమ గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా ఆరాధించే వారు లక్షల్లో ఉన్నారు. సినిమాల్లో ఆయన క్రేజ్, రేంజ్ వేరు. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స్టామినా ఆయనది. ఫిలిం ఇండస్ట్రీలో కింగ్‌లా ఉండే పవన్ ప్రజలకు సేవ చేయాలని పాలిటిక్స్‌లోకి వచ్చారు. సినిమాలతో పాటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ.. ప్రజల తరపున తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ.. ఒంటిరిగా పోరాటం చేస్తున్నారు. హీరోగా ఆయన స్థాయి వేరు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనను విమర్శించే వారు ఎక్కువయ్యారు. అది కూడా వ్యక్తిగతంగా.
ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, ప్యాకేజ్ స్టార్, దత్త పుత్రుడు, వీకెండ్ స్టార్ అంటూ రకరకాలుగా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్లు మౌనంగా భరించిన పవన్.. తనపై అవాకులు, చవాకులు పేలుతున్న వారికి అంతే ధీటుగా, ఘాటుగా సమాధానమిచ్చారు. తమ అభిమాన హీరోని అన్నేసి మాటలు అంటుంటే అభిమానుల బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వాళ్లంతా ఇంతలా వాగుతున్నారు. ఫ్యాన్స్ అయిన మాకే ఇలా ఉంటే.. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతుంటారు?. కానీ ఒక్క నాగబాబు తప్ప మిగతా మెగా – అల్లు ఫ్యామిలీ హీరోలు ఎందుకు మాట్లాడరు? అని ఆందోళన చెందుతుంటారు. పవన్ మీద వస్తున్న కామెంట్స్ గురించి, తమ ఫ్యామిలీ హీరోలు ఎందుకు స్పందించడం లేదు అనే దాని గురించి రీసెంట్ ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
‘పాలిటిక్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మామయ్యను తిడుతుంటే మాత్రం బాధగా ఉంటుంది. ఓసారి నన్ను, చరణ్, వరుణ్, వైష్ణవ్‌లను పిలిచి.. ‘‘నేను పాలిటిక్స్‌లోకి వెళ్తున్నాను. దాని వల్ల నాపై చాలా విమర్శలు వినిపిస్తాయి. చాలా నీచంగా మాట్లాడతారు. అలాంటి వాటికి మీరు రియాక్ట్ కావొద్దు. ఒకవేళ రియాక్ట్ అవ్వాలనుకుంటే ముందుకు రండి.. ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోండి. దాన్ని స్టడీ చేసి, ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకుని అప్పుడు రాజకీయాల్లోకి రండి. అంతే కానీ మీ ప్రొఫెషన్ వదిలి పాలిటిక్స్‌లోకి రావొద్దు. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు. మీరేం పట్టించుకోవద్దు. ఈ విషయంలో నన్ను మన్నించండి’ అన్నారు.
మిమ్మల్ని మన్నించడం ఏంటి మావయ్యా.. అది మా వల్ల కాదని అన్నాం. అప్పుడాయన ఒకటే మాట అన్నారు. ‘రేయ్, నన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరంతా రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, మీరంతా జాగ్రత్తగా ఉండండి. నాకోసం ఆందోళన చెందాల్సిన పని లేదు. నన్ను నేను కాపాడుగోలను. మీ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందని తెలుసు కానీ అది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మేం ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే ఆయన్ని ఎవరేమన్నా మేం రియాక్ట్ కావడం లేదు’’ అంటూ అసలు విషయాన్ని వివరంగా చెప్పాడు సాయి తేజ్.
ఇది కూడా చదవండి : ‘బ్రో’ మూవీ మొదటి రోజు కలెక్షన్స్..