తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా కనిపించింది. మామూలు ధరలతోనే భారీ వసూళ్లు సాధించడం పవన్‌కే సాధ్యం అని మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏరియాల వారీగా ‘బ్రో’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే (హైర్స్, జీఎస్టీ) కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) ఈ శుక్రవారం (జూలై 28) భారీ స్థాయిలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల వర్షం పడుతున్నప్పటికీ హాళ్ల దగ్గర జన ప్రభంజనం కనిపించింది. ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీకి ఏపీ, తెలంగాణలో హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ చేసింది.
ఇన్నాళ్లూ ఫ్యాన్స్, ఆడియన్స్ పవన్ నుండి మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్, స్టైల్, స్వాగ్, వింటేజ్ లుక్స్.. అలాగే పవర్ స్టార్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ వంటివన్నీ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. నిర్మాతలు బేరసారాలవీ చేయకుండా దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ మరీ ఎక్కువ, తక్కువ కాకుండా ఓకే అనుకునే రేట్లకే అమ్మేశారు. అలాగే అదనపు షోలు, టికెట్ రేట్లు పెంపుదల కోసం ఎలాంటి పర్మిషన్లు అడగలేదు. కొన్ని చోట్ల బెన్‌ఫిట్ షోస్ మాత్రం పడ్డాయి.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా కనిపించింది. మామూలు ధరలతోనే భారీ వసూళ్లు సాధించడం పవన్‌కే సాధ్యం అని మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏరియాల వారీగా ‘బ్రో’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే (హైర్స్, జీఎస్టీ) కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ!.. ఆ స్పెషల్ డే నాడు స్ట్రీమింగ్?