రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనది అరుదైన వ్యక్తిత్వం అని డబ్బుకోసం పాకులాడే వ్యక్తి కాదంటూ తెలిపింది. తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కే అంటూ స్పష్టం చేసింది.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న వేళ రాజకీయంగా తన మద్దతు పవన్ కే ఉంటుందని వెల్లడించారు. రేణూదేశాయ్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియోలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. పేదప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, డబ్బు కోసం, డబ్బు వెనకాల పరిగెత్తే మనస్తత్వం పవన్ కు లేదని స్పష్టం చేసింది రేణూదేశాయ్. మొదటి నుంచి రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్నానని తెలిపింది. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో కుటుంబాన్ని పక్కనబెట్టి రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టారు అని తెలిపింది.
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పవన్ కళ్యాణ్ నిరంతరం ఆలోచిస్తుంటారని రేణూ దేశాయ్ తెలిపింది. ఇండస్ట్రీలో తిరుగులేని యాక్టర్ అయిఉండి కూడా పేద ప్రజల సంక్షేమాన్ని కోరి రాజకీయ పార్టీ పెట్టారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆయనది వెనకడుగు వేసే వ్యక్తిత్వం కాదు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండంటూ ప్రజలను, అభిమానులను కోరింది రేణూదేశాయ్. ఇక పవన్ వైవాహిక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని, మూడు వివాహాల గురించి చర్చలు ఆపండంటూ కోరింది. మూడు పెళ్లిల్లపై కొందరు వ్యక్తులు సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని అన్నారు. దయ చేసి ఇలాంటి వాటిల్లోకి నాపిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను కూడా లాగొద్దని రేణుదేశాయ్ అభ్యర్థించింది.