నేను బ్లూఫిల్మ్స్ లో నటించానని ప్రచారం చేశావు.. చంద్రబాబుపై రోజా సీరియస్

అమరావతి- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో బోరున ఏడ్చేసిన చంద్రబాబును చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్చేసరికి ఎంతలా ఆయన హర్ట్ అయ్యారో అర్ధమవుతుంది. మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపధం కూడా చేశారు చంద్రబాబు.

ఇక చంద్రబాబు నాయుడు కన్నీటి పర్వంతంపై ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు నిజంగా ఏడిస్తే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదేంటని జగన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబూ.. విధి ఎవ్వరినీ విడిచిపెట్టదు.. అందరి సరదా తీరుస్తుంది.. అని రోజా వ్యాఖ్యానించింది. అప్పట్లో ఎన్టీఆర్‌ ను ఎలా ఏడిపించావో.. నువ్వు ఇప్పుడు ఏడిచే పరిస్థితి వచ్చిందని రోజా కామెంట్ చేసింది. మనం ఏం చేస్తే.. మనకు అది తిరిగి వస్తుందని చెప్పింది.

Roja shocking comments on chandr

రోజా ఏమందంటే.. ఈ రోజు ఏదో నీ భార్యను అనేశారని చాలా బాధపడిపోతున్నావే.. మరీ ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పీతల సుజాతతో రోజా బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందని సీడీల చూపించిన విషయం మర్చిపోయావా.. అని రోజా ప్రశ్నించింది. మాకు ఫ్యామిలీ లేదా.. మాకు కుటుంబం లేదా.. మాకు గౌరవం లేదా.. అని నిలదీసింది రోజా. విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మను ఏ విధంగా మాట్లాడారో ఎవరూ మార్చిపోలేదని గుర్తు చేసింది.

దొంగ ఏడుపులు ఏడ్చే చంద్రబాబును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోజా అంది. అంతే కాదు.. చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.. నీ కోసం 10 సంవత్సరాలు పని చేసిన లీడర్‌ గా చూడకుండా.. మహిళ అని చూడకుండా నన్ను మానసిక క్షోభకు గురిచేసిన నువ్వు.. నీకు నువ్వే సరైన శిక్ష వేసుకున్నావు.. అని వ్యాఖ్యానించింది రోజా. రెండున్నరేళ్లు కాదు కదా.. మళ్లీ జీవితంలో అసెంబ్లీకి రాలేవన్నారు. బైబై బాబు.. బైబై.. అని తనదైన స్టైల్లో కామెంట్ చేసింది రోజా.