ఆక్సిజన్ ఉత్పత్తిలో రికార్డ్ – గంటకు ఎన్ని సిలండర్లో తెలుసా!.

దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరతనే కాకుండా.. ఆక్సిజన్ కోరత ఏర్పడుతుంది. దీంతో ఆక్సిజన్ అందకుండా.. చాలా మంది కరోనా రోగులు మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

download 5 1

దీంతో పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. ఇక ప్రాణవాయువు కొరతతో చాలా మంది కరోనా భాదితులు ప్రాణాలు కొల్పోతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువుకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆక్సిజన్ ట్యాంకర్లను పంపుతున్న ప్రాణవాయువు ఇబ్బంది మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇంజనీర్లు, రేవా జిల్లా అధికారులతో కలిసి 50 గంటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.

download 4

ప్రస్తుతం ఈ ప్లాంటులో రోజూకీ 100 సిలిండర్లను నింపుతున్నారు. ఇక నగరంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా రీఫిల్లింగ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో 700 సిలిండర్లను రీఫిల్ చేయనున్నారు. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో 50 కిలోల లీటర్ లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ఉంది. ఇతర రాష్ట్రాల నుండి మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను పొందడంతో పాటు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన తట్టింది అక్కడి అధికారులకు. ఆక్సిజన్ సాంద్రత ద్వారా ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేయబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here