‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే.. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’అని వచ్చే నెల నుండి సామాన్యుడు పాడుకునే పరిస్థితి రాబోతుంది. జీతం పెరగకపోయినా ప్రతి నెలా ఖర్చులు మాదిరిగానే వచ్చే నెల కూడా లెక్కలు వేసుకుంటే మాత్రం మీ అంచనాలు తల్లకిందులు అవ్వడం ఖాయం.
‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే.. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’అని వచ్చే నెల నుండి సామాన్యుడు పాడుకునే పరిస్థితి రాబోతుంది. జీతం పెరగకపోయినా ప్రతి నెలా ఖర్చులు మాదిరిగానే వచ్చే నెల కూడా లెక్కలు వేసుకుంటే మాత్రం మీ అంచనాలు తల్లకిందులు అవ్వడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరల్లో పెరుగుదల చూశాం. ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లతో పాటు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మార్పులు కూడా చోటుచేసుకోబోతున్నాయి. ఇవన్నీ గమనించి లెక్కలు బేరీజు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒకసారి ఇటు ఓ లుక్కేస్తే సరి.
ప్రతి నెలా మాదిరిగానే.. వచ్చే నెల కూడా సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దేశీయ వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలను సమీక్షిస్తాయి. దీంతో పీఎన్జీ నుండి సీఎన్జీ గ్యాస్ వరకు ధరల్లో వ్యత్యాసం నెలకొనే అవకాశాలున్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు జరపాలనుకుంటే.. మీకు డబ్బులు వచ్చేవి ఉన్నా.. బ్యాంకు రిలేటెడ్ పనులు ఉన్నా.. బ్యాంకు సెలవులు ఉండబోతున్నాయి గమనించండి. వివిధ రాష్ట్రాల్లో పండుగ, వారపు సెలవులతో సహా బ్యాంకులో ఆగస్టులో మొత్తం 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇక ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ తేదీ కూడా ఈ నెలతో ముగియనుంది.
జూలై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఆగస్టు 1 నుంచి రూ.5 వేల జరిమానా పడనుంది. వార్షికాదాయం 5 లక్షల లోపు ఉన్న వారికి రూ.1000 జరిమానా విధించనున్నారు. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023. అలాగే పలు బ్యాంకులు ఎఫ్డీ పథకాలను తీసుకు వచ్చాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. ఆగస్టు 15 చివరి తేదీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు అందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ ధరల పెరుగుదలతో పాటు ఈ మార్పులు చూస్తుంటే జేబుకు చిల్లు పడటం ఖాయమైనట్లు కనిపిస్తుంది. ఏమంటారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.