డిప్యూటి కలెక్టర్ తన పదవికి రాజీనామా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అధికారులు, ప్రభుత్వానికి మధ్య కొన్ని కొన్ని సార్లు సమన్వయ లోపంతో వివాదాలు చోటుచేసుకుంటాయి. విధుల్లో అలసత్వం వహించడం ద్వారానో దురుసు ప్రవర్తన వల్లనో ప్రభుత్వ ఆగ్రహానికి అధికారులు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ డిప్యూటీ కలెక్టర్ తన ఇంటి ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అడ్డు పడుతోందని, తనకు సెలవు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని భావించిన ఆమె డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేసింది. దీనికి సంబంధించిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా డిప్యూటి కలెక్టర్ తన పదవికి రాజీనామా చేశారు. లవకుష్ నగర్ ఎస్ డిఎమ్ గా నియామించబడిన నిషా బాంగ్రే అక్కడే విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 25న బేతుల్ జిల్లాలోని ఆమ్లాలో తను నిర్మించుకున్న ఇంటి యొక్క ప్రారంభోత్సవం ఉంది. దానికి హాజరయ్యేందుకు నిషా బాంగ్రే సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి కోరింది. కానీ సెలవు మంజూరు చేయకుండా నిరాకరించింది. దీంతో నిషా బాంగ్రే తన ఇళ్లు ప్రారంభోత్సవంతో పాటు మతపరమైన ఆచారానికి హాజరవ్వకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించింది.
దానికి నిరసనగానే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ లేకను విడుదల చేశారు. ఆ లేఖను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఆ లేఖలో తన ఇంటి ప్రారంభోత్సవానికి వెల్లకుండా చేసేందుకే తనకు సెలవు ఇవ్వలేదని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని తెలిపింది. నా హక్కులు, విశ్వాసాలను కోల్పోలేను అని చెప్పింది. ఇక ఆ పదవిలో కొనసాగలేనని డిప్యూటి కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నానని నిషా బాంగ్రే వెల్లడించింది. ఇదిలా ఉంటే నిషా బాంగ్రే రాజీనామాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదు.
गृह प्रवेश में जानें की छुट्टी नहीं मिली तो छतरपुर की डिप्टी कलेक्टर निशा बांगड़े ने दिया इस्तीफा !
पत्र में सरकार पर धार्मिक भावना को ठेस पहुंचाने के लगाए आरोप ! pic.twitter.com/xBhiY2YUVl
— काश/if Kakvi (@KashifKakvi) June 22, 2023