డ్రోన్ల వినియోగం బహుముఖ రీతిలో విస్తరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్‌ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వికారాబాద్ జిల్లాలో రవాణా సదుపాయాలు లేని మారుమూల అటవీప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై‘ అని పేరుపెట్టారు. వికారాబాద్ లో జరిగిన ఓ […]
ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసింది. ఈ మందును పంపిణీ చేయాలని కూడా ఇటీవలే ఏపీ సర్కార్, హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందును టిటిడి ఉద్యోగులకు కూడా […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]
పెట్రోల్ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం […]
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ […]
ఆక్సిజన్‌కు అంతగా గిరాకీ లేని ఏప్రిల్ మొదటి వారంలో 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపేందుకు రూ. 350 తీసుకునేవారు. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో ఆ ధర రూ. 600కు పెరిగింది. కొవిడ్ మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగాయి. అదే నెల 20 నాటికి రూ.1000కి పెరగ్గా ఈ నెల మొదటి వారానికి మరింత పెరిగి రూ. 2500 నుంచి రూ. […]
క్లినికల్ ట్రయల్స్ తర్వాత కోవిడ్-19 లక్షణాలను 15 నుంచి 11 రోజులకు రెమ్‌డెసివిర్ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్ పెరిగింది. కానీ అది దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. దీంతో కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు చాలినన్ని నిల్వ ఉన్నాయన్నారు. […]
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. కొవిడ్ కంటే ముందు వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. గత మార్చి నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాటమ్ అవుట్ అయిందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో […]
రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు […]