Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం!

Delhi Mundka Fire

వేసవి కాలం అంటే అగ్ని ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు అధికం. ఇక కొన్ని రోజుల క్రితమే ఇండోర్‌లో ఓ వ్యక్తి.. తన ప్రేమను కాదన్నందుకు యువతి స్కూటీకి నిప్పు పెట్టగా.. ఆ మంటలు మిగతా వాహనాలకు వ్యాపించి.. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పలువురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించడంతో ఇంత భారీ ప్రాణ నష్టం సంభవించగా… మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదం ఇదే కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Indore Fire Accident: ఇండోర్ ఏడుగురు సజీవ దహనం ఘటనలో ట్విస్ట్.. ప్రేమను నిరాకరించినందుకు నిప్పుపెట్టాడు!

Delhi Mundka Fire

మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించి, పొగ అలుముకుంటుండగా.. అందులో ఉన్న వారు తాళ్ల సాయంతో, కిటీకిలు పగలగొట్టుకుని బయటకు వచ్చేందకు ప్రయత్నం చేసిన దృశ్యాలు బయటకొచ్చాయి. కొందరైతే మంటలు అంటుకున్న భవనం నుంచి మరో భవంతిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక శుక్రవారం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల సమయంలో మంటలు అంటుకోగా.. అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్ల సాయంతో అర్ధరాత్రి వరకూ మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చిందంటే ప్రమాదం తీవ్రత ఎంత భారీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Bhadradri: మద్యం కోసం గొడవ.. పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఎస్సైని కూడా వదల్లేదు..

Delhi Mundka Fire

తొలుత శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో స్థానికులకు పొగ కనిపించింది. ఆ తర్వాత మంటలు కనిపించాయి. కాసేపట్లోనే ఆ భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ భవనంలో సీసీటీవీలు, వైఫై రౌటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తారని పోలీసులు తెలిపారు. జనరేటర్ ఉంచిన మొదటి అంతస్తులో మంటలు మొదలై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత రెండు, మూడో అంతస్థుకు వ్యాపించి ఉంటాయన్నారు. దీంతో ఆ ఫ్లోర్లలో పని చేస్తున్న వారు మంటల్లో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి భవనం లోపలికి వెళ్లే సరికే వారికి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 27 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: Maharashtra: పిల్లి పిల్ల అనుకొని ఈ చిన్నారి ఇంటికి ఏం తెచ్చిందో చూస్తే బైండ్ బ్లాక్!

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పు సాయం చేస్తామన్నారు. ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Delhi Mundka Fire

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.