Maharashtra: పిల్లి పిల్ల అనుకొని ఈ చిన్నారి ఇంటికి ఏం తెచ్చిందో చూస్తే బైండ్ బ్లాక్!

చిన్న పిల్లలు చేసే పనులు అప్పుడుప్పుడు ఎంతో ముద్దు అనిపిస్తుంటాయి. చిన్న పిల్లలకు మంచీ చెడూ అనేది ఏదీ తెలియదు.. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దలు ఎంతో గారాబంగా పెంచుకుంటారు. చిన్న పిల్లలకు చిన్నతనంలో ఉన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తే పండగే పండుగ. వాటితో మైమరచిపోయి ఆడుకుంటారు. అయితే అప్పడప్పుడు చిన్న పిల్లలు చేసే పనులు చూసి షాక్ అవుతుంటారు. బయట ఆడుకుంటూ వెళ్లిన పిల్లలకు తమకు దొరికింది ఏదైనా ఇంటికి తెస్తుంటారు.

image 1 compressed 51ఓ చిన్నారి బయట ఆడుకుంటూ వెళ్లి ఇంటికి పిల్లి పిల్ల అనుకొని ఏకంగా చిరుత పిల్లను తీసుకు వచ్చింది. అలా చిన్నారి చేసిన పనికి కుటుంబ సభ్యులకు గుండె గుభేల్ మంది. కాకపోతే ఆ చిరుత పిల్ల రోజుల వయసుది కనుక ఎవరినీ ఏమీ చేయలేదు. ఈ సంఘటన మహారాష్ట్ర మాలేగావ్ లోని మోర్జార్ లో జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కాస్త ధైర్యం చేశారు. కూన పిల్ల కోసం తల్లి చిరుత వస్తుందేమో అని ఓ వారం రోజులు పాటు పరిసర ప్రాంతాలు గమనించారు. కానీ తల్లి చిరుత జాడ కనపడలేదు. అలా వారం రోజుల పాటు ఆ చిన్న చిరుత కూనకు పాలు పడుతూ తమ వద్దనే జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి సమాచారం అందించారు. అటవీశాఖ వారు వచ్చి ఆ చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: Nizamabad: వైద్య విద్యార్థి హఠాన్మరణం.. ఇదే కారణమంటున్న వైద్యులు!

తమ పాప తీసుకు వచ్చిన చిరుత కూన ఎంతో ముద్దుగా ఉందని.. దానికి రోజుకీ లీటరు పాలు పోస్తూ వచ్చామని, తల్లి చిరుత జాడ కోసం తామంతా భయం భయంగా ఎదురు చూస్తుంటే, తమ పాప మాత్రం చిరుత కూనతో ఎంతో సరదాగా ఆడుకుందని చిన్నారి కుటుంబ సభ్యులు అన్నారు. ఆ చిరుతను ఏవైనా పక్షలు కానీ, కోతులు కానీ ఎత్తుకొచ్చి ఆక్కడ పడేసి ఉండొచ్చని అటవీశాఖవారు భావిస్తున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారి పేరు చిముకల్య. ప్రస్తుతం ఈ వార్తు అక్కడి స్థానికుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.