సైబ‌ర్ బీమా – డిజిటల్ ధీమా!..

డిజ‌ట‌ల్ ఆస్తుల‌కు, సైబ‌ర్ నేర‌స్థు‌లు ద్వారా పొంచివున్న ప్ర‌మాదం, సైబ‌ర్ బీమా అవ‌స‌రాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబ‌ర్ నేరా‌ల దృష్ట్యా బ‌జాజ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ పాల‌సీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగ‌త‌నం, ఈమెయిల్ స్పూకింగ్‌, సైబ‌ర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 ర‌కాల సైబ‌ర్ నేర‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌క్తుల‌కు బీమా సౌక‌ర్యాల‌ను అందిస్తుంది. సైబ‌ర్ దాడి అనంత‌రం అయ్యే ఖ‌ర్చుల‌ను సైబ‌ర్ బీమా క‌వ‌ర్ చేస్తుంది. పాల‌సీ జాబితాలో పేర్కొన్న వివిధ ర‌కాల సైబర్ నేరాలు జ‌రిగిన అనంత‌రం ప్రాసిక్యూషన్ ప్రక్రియ, రక్షణ కోసం వెచ్చించే ఖర్చు, బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆర్థిక న‌ష్టం, సైబ‌ర్ నేరాల కార‌ణంగా పాల‌సీదారుడు ఆన్‌లైన్లో న‌గ‌దు కోల్పోయిన‌ప్పుడు, పాల‌సీలో ఇచ్చిన విధంగా హామీని చెల్లిస్తాయి. మాల్వేర్ యాడ్ ఫిషింగ్‌, ఇ-మెయిల్ ద్వారా ఆన్‌లైన్ మోసాల కేసులు ఏడాదికి ఏడాది పెరిగిపోతుండ‌డంతో భార‌త్‌లో సైబ‌ర్ బీమా అవ‌స‌రం కూడా పెరుగుతుంది. కోవిడ్‌-19 స‌మ‌యంలో ఈ ర‌క‌మైన కేసుల సంఖ్య మ‌రింత పెర‌గ‌డ‌మే ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది. సైబ‌ర్ మోసాల‌కు వ్య‌తిరేకంగా ద్ర‌వ్య భ‌ద్ర‌త కోసం ప‌లు బీమా సంస్థ‌లు సైబ‌ర్ బీమాను అందిస్తున్నాయి. సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడులను బీమా క‌వ‌ర్లు నిరోధించ‌లేవు అయితే ఈ న‌ష్టాల ఆర్థిక ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి.

dreamstime m 138605425

అయితే కొన్ని విషయాల్లో ఈ బీమా వర్తించదు. అంత‌ర్జాతీయంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగే దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. బీమా తీసుకున్న వ్య‌క్తులు మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలుకు ముందుగా జ‌రిగిన దాడుల‌ను గాని, పాల‌సీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాల‌ను గాని పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. స‌రైన పాస్‌వ‌ర్డ్‌తో యాంటీ వైర‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌క‌పోయినా‌, త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోకపోయినా పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు.ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌జ‌లు అధిక శాతం ఈమెయిల్‌, సోష‌ల్ మీడియాలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ లావాదేవీలను తరచూ నిర్వహిస్తారు. నిపుణుల స‌ల‌హాలు, సంప్ర‌దింపులు, స‌రైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు లేకుండానే వారి వ్యాపారాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానించి సైబ‌ర్ నేరానికి గుర‌వుతున్నారు. అన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను తీసుకుంటూ, ఆన్‌లైలో చురుకుగా కార్య‌కాలాపాలు జ‌రిపే వారికి ఇది చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.