ఈ మద్య కాలంలొో చాలా మంది పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్ లైన్ వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ మద్య కాలంలో చాలా మంది ఎక్కువగా రిస్క్ లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుంటున్నారు. అయితే డబ్బు సంపాదించడం అంత సులవైన పని కాదు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూనే చిన్న చిన్న పనులు ద్వారా డబ్బును సులభంగా సంపాదిస్తున్నారు. అలానే మీకు షార్ట్ టైం లో డబ్బు సంపాదించాలని ఉందా..? అవును అట్లాయితే హిమాలయాలకు వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఇంతకీ హిమాలయాల్లో ఎముందా అని అనుకుంటారా? అక్కడ దొరికే ఓ అరుదైన పదార్థం తో మీరు ఈజీగా కోటీశ్వర్లు అయిపోతారు. ఆ వింత పదార్థం ఏంటో తెలుసుకుందామా? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇక్కడ ఎండు మిరపకాయల్లాగ కనిపిస్తున్న ఈ వింత పదార్థం ఒక కిలో ధర సుమారు 70 లక్షలు. ఒక గ్రాము విలువ దాదాపు 7000 రూపాయలు. ఇంత ఖరీదైన ఈ పదార్థంలో ఏం స్పెషాలిటి ఉందని ఆలోచిస్తున్నారా.. ఈ పదార్థాన్ని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. మనుషులలో లైంగిక సంబందిత వ్యాధులు ఉంటే ఇది చాలా అద్బుతంగా పనిచేస్తుందని అంటారు. ఈ పదార్థానికి చైనా తో పాటు కొరియా, థాయిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ఎండు మిరపకాయల్లా ఉండే పదార్థం ఒక గొంగలి పురుగు. ఇది హిమాలయాల్లో సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఈ గొంగళి పురుగులు ఓ వింత ఫంగస్ వల్ల చనిపోయి ఎండిపోతుంటాయి. అలా చనిపోయిన ఈ గొంగలి పురుగే హిమాలయ వయగ్రా అంటారు.
ఇలా ఎండిపోయిన పురుగులతో అనేక లైంగిక సంబంధిత ఔషదాలను తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే మే, జూన్ నెలలు వచ్చాయంటే చాలు విదేశాల నుంచి సైతం చాలామంది నేపాల్ భూటాన్ ఉత్తరాఖండ్, సిక్కిం ఇలా హిమాలయ పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వచ్చి.. హిమాలయన్ పురుగులను సేకరిస్తుంటారు. మన అదృష్టం బాగుంటే.. ఓకేసారి కిలో పురుగులు దొరికితే 70 లక్షల రూపాయలు మన సొంతం అవుతాయి. కానీ ఒక్కొక్కసారి పురుగుల వేటకు వెళ్లామంటే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మరి పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది. మూడు వేల ఎత్తు ఉన్న పర్వతాలు ఎక్కాలంటే చాలా మంది వెనుకంజ వేస్తారు. కానీ స్థానికులు, ఎక్కువ మంది విదేశీయులు ఈ పురుగులను సేకరించే పనిలో ఉంటారు.
ఒక కిలో బంగారం కన్నా పురుగుల ధర చాలా ఎక్కువగా ఉంది. వీటికి సరైన మెుత్తంలో ధర రావాలన్నా కూడా కొనుగోలు దారులు ఎవరో మనం ముందే గుర్తించుకోవాలి. ఈ హిమాలయన్ వయాగ్రా పురుగులు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు వల్ల ఎక్కువగా లభించడం లేదు. అందువలన వీటి జాతి కూడా క్రమ క్రమంగా అంతరించిపోతుంది. ఈ నేపథ్యంలోనే వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పురుగులను ఔషదాల తయారిలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇది కేవలం లైంగిక సామర్థ్యం కోసమే కాకుండా.. క్యాన్సర్, డయాబెటిస్, ఆస్తమా సహా పలు వ్యాధులను తగ్గించుకునేందుకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.