అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయి. ఉత్తరాఖండ్లో ట్రాన్స్ఫార్మర్ పేలి పలువురు దుర్మరణం పాలయ్యారు.
ఇటీవల అనుకోని ప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్లపై వాహనాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనో.. అతివేగం వల్లనో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు పనులు చేసేచోట ప్రమాదాలు సంభవించి కూడా చాలామంది చనిపోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్లో ట్రాన్స్ఫార్మర్ పేలి పలువురు దుర్మరణం పాలయ్యారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుత్ షాక్కు గురై 15 మంది మృతి చనిపోయారు. 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన ఉత్తరాఖండ్ చమోలి డ్యామ్ వద్ద జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.