తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ తమదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే అతి కొద్ది మంది యాంకర్స్ మాత్రమే తమ కెరీర్ దీర్ఘకాలికంగా కొనసాగిస్తు వచ్చారు. అలాంటి వారిలో యాంకర్ ఝాన్సీ ఒకరు.
తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ ఒక్క వెలుగు వెలిగి కొంతకాలానికి తెరమరుగు అయిపోయారు. బుల్లితెరపై కొన్ని దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న యాంకర్స్ ని వేళ్ళపై లెక్కించవచ్చు. అలాంటి టాలెంటెడ్ యాంకర్స్ లో ఝాన్సీ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూ వచ్చింది. ఆ తరువాత పలు షోలతో స్టార్ హోదాని దక్కించుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. వాటిని ఝాన్సీ సులభంగానే దాటుకుని ఇండస్ట్రీలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ఆ తరువాత బుల్లితెర నుండి వెండితెరకి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా తన ప్రత్యేకతని చాటుకుంటూ అవకాశాలు దక్కించుకున్నారు. వెండితెర, బుల్లితెరపై తన సత్తా చాటిన ఝాన్సీ గతంలో తనకు జరిగిన చేదు అనుభవాల మీడియాతో పంచుకుంది.
తెలుగు బుల్లితెరపై తమదైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచిన వారిలో యాంకర్ ఝాన్సీ ఒకరు. గంభీరంగా మాట్లాడుతూ.. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే ఝాన్సీ.. స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి పేరు సంపాదించింది. ఒకానొక దశలో ఉదయ భాను తర్వాత బెస్ట్ యాంకర్ ఎవరంటే వెంటనే ఝాన్సీ పేరు చెప్పేయాల్సిందే. ఇక ఈమె ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా చేసిన టాక్ ఆఫ్ ది టౌన్ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, నవీన ప్రోగ్రామ్స్ కూడా ఈమెకు మంచి పాపులారిటీని తీసుకొని వచ్చాయి. ఇక మరో వైపు సినిమాలు కూడా చేస్తూ తన లైఫ్ ని బిజీ గా మార్చుకుంది. ఇప్పటివరకు 45 సినిమాల్లో నటించిన ఝాన్సీ కెరీర్ అంతా సవ్యంగా లేదని.. తన జీవితంలో కూడా కొన్ని చేదు సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
ఝాన్సీ మాట్లాడుతూ” కొత్తలో నాకు చాలా పొగరు ఉండేదని అనుకునేవారు. కానీ అందులో వాస్తవం లేదు. నేను ఏంటి అనేది నాతో పని చేసిన వారికి తెలుసు. నేను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళ నన్ను ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. నన్ను అర్ధం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్లు 13 ఎపిసోడ్స్‌తోనే ఫుల్‌స్టాప్ పెట్టేశారు. నా జీవితంలో దారుణమై సంఘటన ఏమిటంటే.. ఓ డ్యాన్స్ షోకి 99కి ఎపిసోడ్స్ నేను యాంకర్‌గా చేసాను. అయితే నేను సరిగ్గా 100 వ ఎపిసోడ్ చేసే టైములో యాంకరింగ్ నాతో కాకుండా వేరే వారితో చేయించారు. దానికి కారణం నాకు వారు చెప్పలేదు. నేను కూడా వారిని అడగలేదు. అంతేకాదు చాల సందర్భాల్లో నాకు రావాల్సిన క్రెడిట్ ని నాకు రాకుండా చేశారు. ఎంతోమంది మోసం చేశారు. కానీ వారందరిని గుర్తుపెట్టుకొని కక్ష సాధించే ఉద్దేశం నాకు లేదు. అది మంచి తనమో, పిచ్చి తనమో తెలియదు”.అని విచారం వ్యక్తం చేసింది. మరి ఝాన్సీ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.