సినిమా రంగం వైపు రావాలన్న ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు దర్శకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ యాంకర్ ఝాన్సీని వివాహం చేసుకున్నారు.
తెలుగు బుల్లితెరపై అనేక మంది యాంకర్లు ఉన్నారు. అయితే ఇందులో మేల్ యాంకర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పటితో పోల్చుకుంటే గతంలో మగ యాంకర్ల జాబితా చాలా తక్కవే. అటువంటి వారిలో ఒకరు జోగి నాయుడు. జోగి నాయుడు బ్రదర్స్ పేరుతో అనేక షోలు చేశారు. చాలా పాపులర్ అయ్యారు. సినిమా రంగం వైపు రావాలన్న ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు దర్శకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ యాంకర్ ఝాన్సీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని, మరో వివాహం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మొదటి పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘1994-95లో ఝాన్సీ నాకు పరిచయమైంది. అప్పుడామె ఇంటర్ చదువుతోంది. నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో తను పరిచమైంది. కొత్త వాళ్లతో సినిమా తీయాలని ..జీకే మోహన్ అనుకున్న సమయంలో ఆమెను తీసుకున్నారు. అప్పుడు మా మధ్య ప్రేమ చిగురించింది. అయిపోయిన దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు. గతంలో జరిగిపోయిన వాటిలో మంచి మెమోరీస్ గుర్తుపెట్టుకోవడమే ఇష్టం. ఇప్పటికీ ఆ మంచి మెమోరీస్‌ను గుర్తుపెట్టుకుంటాను, సరదాగా ఎంజాయ్ చేస్తాను. అవి ఎనర్జీనిస్తాయి. కష్టాలను గుర్తుతెచ్చుకుంటే ఇంకా మనం వెనక్కు వెళ్లిపోతాం. ఝాన్సీ విషయంలో మేము కలిసున్న దగ్గరి నుండి మేము విడిపోయే వరకు చాలా మంచి జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటాను.’అని తెలిపారు.
‘8-9 ఇయర్స్ వరకు మేము బిజీగా ఉన్నాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తను యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చాం. బాగా ఎదిగిన టైంలో మనస్పర్థలు వచ్చాయి. ఏడాదిలో విడిపోవాల్సి వచ్చింది. నేను కలిసి ఉండేందుకు ప్రయత్నాలు చేశాను. కానీ కుదరలేదు. నేను టైమ్ బాగా నమ్ముతాం. మన డెస్టినీ ఒకటి డిసైడ్ అయినప్పుడు..దానికి రివర్స్ లో ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. మనం కలవాలని డెస్టినీ ఉండగా.. విడిపోవాలనుకున్నదీ కూడా ఓ డెస్టినే కదా. ఏమోషన్స్ ఉన్నవాళ్లం మనం. అందరీ మనస్థత్వాలు ఒకేలా ఉండవు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందులో ఉండిపోవాలా, బయట పడాలా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను 7-8 ఏళ్లు బయటకు రాలేకపోయాను. కారణం తన కూతురు ధన్య. ఏదీ జరగదనీ తెలిసి.. కూడా మన కెరీర్ బాగుటుందని, కూతురు భవిష్యత్తు బాగుంటుందని భావించాను’అని అన్నారు
తాము కలవమని తెలిసినా కూడా.. తమను కలిపేందుకు బ్రహ్మనందం ప్రయత్నించారని, తండ్రి స్థానంలో ఉండి ప్రయత్నించారు కానీ కాలేదన్నారు. అప్పట్లోప తాను స్టూడియో పెట్టినప్పుడు.. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి వచ్చి ఓపెన్ చేశారని తెలిపారు. అడిగిన వెంటనే చిరంజీవి ఓపెనింగ్‌కు ఒప్పుకున్నారని.. చిరంజీవి కూడా మమ్మల్ని కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు. చిరంజీవి అంటే తనకు ఇష్టమని, కానీ ఆయన నాకు ఫ్యాన్ అన్నారు. అందుకని ఝాన్సీతో చాలా మెమెరీస్ ఉన్నాయన్నారు. ఆమెకు కలిసే ఉద్దేశం లేదని తెలిసి, ఇక తానే కాంప్రమైజ్ అయ్యి విడాకులపై సంతకం చేశానన్నారు. తర్వాత తల్లిదండ్రులు మరో పెళ్లి చేశారన్నారు. ఝాన్నీ గురించి చదువు అంటే ఇష్టమని, తన కూతుర్ని బాగా చదివిస్తుందని మెచ్చుకన్నారు. కూతురు తనకు దూరంమైదంటూ ఎమోషనల్ అయ్యారు.