తెలుగు బుల్లితెరపై యాంకర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చే నటి సుమ. ఆమె గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. తిరుగులేని రారాణిగా వెలుగొందుతోంది. బుల్లి తెర షోలైనా, సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చే నటి సుమ. ఆమె గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలుగొందుతోంది. బుల్లి తెర షోలైనా, సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సరదా ప్రశ్నలు వేస్తూ, జవాబులు రాబడుతోంది. యాంకర్ అంటే సుమ, సుమ అంటే యాంకరింగ్ అనేలా మారిపోయింది. సుమారు మూడు దశాబ్దాల నుండి యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు పోటీ లేదని చెప్పొచ్చు. అయితే ఈ సుమ ఇంత టాలెంట్ యాంకర్ అవ్వడానికి వెనుక పరోక్షంగా మరో యాంకర్ కమ్ నటి ఉన్నారు. ఆమె మరెవ్వరో కాదూ ఉదయ భాను. ఇప్పటి యువతరానికి ఈ యాంకర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ..ఒకప్పుడు యాంకరింగ్‌కు సొగసులు అద్దిన నటి మాత్రం ఉదయ భానునే.
తొలుత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉదయ భాను.. ఎర్రసైన్యం,కొండవీటి సింహాసనం వంటి పలు సినిమాల్లో నటించింది. ఒడ్డు, పొడుగు ఆమెకు ప్లస్ అయ్యాయి. అయితే సినిమా రంగంలో ఆఫర్లు రాకపోవడంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. అనేక సీరియల్స్ చేసింది. టెలివిజన్ రంగం అభివృద్ధి చెందుతున్న తొలి నాళ్లల్లో యాంకర్ అవతారం ఎత్తింది. ఈటీవీలో ప్రసారమయ్యే ‘హార్లిక్స్ హృదయాంజలి’ ఎంత ఫేమస్ అయ్యిందంటే..? ఉదయ భాను పేరు మారు మ్రోగిపోయింది. ఆ తర్వాత అనే వన్స్ మోర్ ప్లీజ్, జానవులే నెరజానవులే, రేలా రేలా వంటి షోలకు యాంకరమ్మ అయ్యి.. తన ఈజ్ నటన, స్పాంటేనియస్‌తో మంత్ర ముగ్దులను చేసింది. ఆ తర్వాత క్రమ క్రమంగా తెరమవ్వడం ప్రారంభించింది. ఏమైంది అనుకునేలోపు ఏవేవో రూమర్లు చక్కర్లు కొట్టాయి. మధ్యతరగతి కష్టాలను చవి చూసిన ఉదయ భానుది ముక్కు సూటి స్వభావం. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుందని ఆమె వీడియోలు చూసిన వారికి తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆమె ఏమందంటే..? ప్రశ్నించే గళాలు.. అణచివేయబడతాయని.. అందుకు తానే నిదర్శనమంటూ ఓ వేదికపై మాట్లాడింది. ఆమెకు యాంకరింగ్ చేసే అవకాశాలు తగ్గిపోవడానికి కారణాల వెనుక కుట్ర జరిగిందని ఆమె చెప్పకనే చెప్పింది. గతంలో ఓ పాట పాడగా.. అప్పటి నుండి తనకు అవకాశాలు తగ్గిపోయానని, మీకు నేను కనబడి ఐదేళ్లు అయిపోయిందని, అయినప్పటికీ తనను మీరెవ్వరూ మర్చిపోలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను బట్టి చూస్తే నిజమేనన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. ఎందుకంటే.. ఆమె గత కొన్నేళ్లుగా టీవీ రంగంలో కనిపించడం లేదు. ఇటీవల కొన్ని షోలకు యాంకర్ గా పనిచేసినా కొన్ని ఎపిసోడ్లకే పరిమితమౌతుంది. పోనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకుంటే.. ఝాన్సీ, సుమ, ఇతర యాంకర్లకు కూడా సమస్యలు ఉన్నాయి కానీ.. వారెవ్వరూ బుల్లి తెర, సినిమా రంగం నుండి దూరం జరగలేదు. ఇప్పడు ఆమె అన్న మాటలను బట్టి చూస్తుంటే.. ఆమెను నిజంగా తొక్కేశారన్న అనుమానం రాకమానదు. ఆమె గొంతును నొక్కాల్సిన అవసరం ఎవ్వరి ఉందంటూ ప్రశ్నలు మొదలౌతున్నాయి.