భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. భార్య నచ్చిన కూర వండలేదన్న కారణంతో మనస్థాపానికి గురై భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. క్షణికావేశంలో చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యాననే కారణాలు ఎత్తి చూపి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం ఓ భర్త.. భార్య కోడి కూర వండలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఝాన్సీ ప్రాంతం. ఇక్కడే పవన్-ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కిందటే వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్నికొనసాగించారు. ఇక వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలోనే ఆ మహిళ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విషయం ఏంటంటే? ఇటీవల ఓ రోజు రాత్రి ప్రియాంక అన్నం, కూర వండి భర్త కోసం రెడీగా పెట్టింది. ఇదే సమయంలో పవన్ ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూనే చికెన్ వండాలని భార్యను కోరాడు. అప్పటికే కూర వండానని భార్య చెప్పింది.
పవన్ అయినా వినకుండా ఇప్పుడు ఖచ్చితంగా చికెన్ వండాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. ఇక ఇదే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ గదిలోకి వెళ్లి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. పవన్ సోదరుడు వెంటనే స్పందించి తలుపులు బద్దులు కొట్టి చూడగా.. అతడు అప్పటికే మరణించాడు. ఆ తర్వాత మృతుడి సోదరుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. భార్య కోడికూర వండలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.