టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, వ్యక్తిగత గోప్యత ఎంతో సన్నగిల్లుతోంది. ఇప్పటికే ఎన్నో సైబర్ అటాక్స్, డేటా చోరీలు జరిగాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. ఒక మాల్ వేర్ ఏకంగా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ ని ఇన్ ఫెక్ట్ చేసింది. అది కూడా 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న యాప్స్ అవి.
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోకి మాల్వేర్‌లను పంపిస్తూ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే గ్యాడ్జెట్లపై మాల్వేర్‌ల దాడి అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి మాల్వేర్‌ల దాడుల గురుంచి గూగుల్ ఎప్పటికప్పుడు యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. పలానా యాప్స్‌లో మాల్వేర్‌లు చొరబడ్డాయని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండని సూచిస్తుంది. ఇలాంటి 17 యాప్‌లను గూగుల్ తాజాగా గుర్తించింది. ఇవి ఫోన్‌లోని బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు సహా […]
జోకర్ మాల్‌వేర్ గూగుల్ ప్లేస్టోర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మాల్‌వేర్‌తో ఉన్న యాప్స్ డేంజరస్ కావడంతో యూజర్లకు నష్టం తప్పట్లేదు. రెండు నెలల క్రితం జోకర్ మాల్‌వేర్ ఉన్న 11 యాప్స్‌ని తొలగించింది గూగుల్. ఇటీవల మరో 6 యాప్స్‌ని రీసెర్చర్స్ గుర్తించడంతో వాటిని కూడా ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలో కూడా జోకర్ మాల్‌వేర్‌తో ఉన్న 24 యాప్స్ తొలగించింది. ఇప్పుడు జోకర్ మాల్‌వేర్ ఉన్న మరో 17 యాప్స్ […]
విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్‌డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్‌డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్‌డేట్ తర్వాత గూగుల్ క్రోమ్ మాల్‌వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు […]
డిజటల్ ఆస్తులకు, సైబర్ నేరస్థులు ద్వారా పొంచివున్న ప్రమాదం, సైబర్ బీమా అవసరాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగతనం, ఈమెయిల్ స్పూకింగ్, సైబర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 రకాల సైబర్ నేరలకు వ్యతిరేకంగా వ్యక్తులకు బీమా సౌకర్యాలను అందిస్తుంది. సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులను సైబర్ బీమా కవర్ చేస్తుంది. పాలసీ జాబితాలో పేర్కొన్న వివిధ రకాల […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్ వర్మ్ అనే మాల్‌వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్‌వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్‌లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]