విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్‌డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్‌డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్‌డేట్ తర్వాత గూగుల్ క్రోమ్ మాల్‌వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు చెల్లించాలి అని పేర్కొంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే వివరాలన్నీ సైబర్ క్రైమినల్ చేతికి చిక్కుతాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీన్నే స్మిషింగ్ ట్రోజాన్ అంటున్నారు. సైబర్ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేస్తే ఇప్పుడు ఏకంగా గూగుల్ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాల కోసం వాడుకుంటున్నారు. గూగుల్ క్రోమ్ యాప్ లాంటి ఒక కొత్త నకిలీ గూగుల్ క్రోమ్ మాల్‌వేర్ యాప్ ను సృష్టిస్తున్నారు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ బాధితుడి ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అయిన తర్వాత. బాధితుల మొబైల్ నుంచి వారానికి 2000 కంటే ఎక్కువ మెసేజ్ లను, ప్రతిరోజూ 2 లేదా 3 గంటలలో ఒకరినొకరు అనుసరిస్తున్నట్లు అనిపించే యాదృచ్ఛిక ఫోన్ నంబర్లకు పంపుతుంది.
ఇలా ఒకరి మొబైల్ నుంచి మరొక మొబైల్ కి పంపించి దాడి చేస్తారు. ఈ నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ చూడటానికి అధికారిక క్రోమ్ యాప్ లాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యాప్ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి నిజమైనది కానిది గుర్తుపట్టొచ్చు. ఇలాంటి సైబర్ నెరగాళ్ల చేతిలో చిక్కుకుండా ఉండటానికి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోవడం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడ కూడా డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయవద్దు అని సూచిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు ఎల్లప్పడు అధికారిక గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసి అప్‌డేట్ చేసుకోవాలని కోరారు.