టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, వ్యక్తిగత గోప్యత ఎంతో సన్నగిల్లుతోంది. ఇప్పటికే ఎన్నో సైబర్ అటాక్స్, డేటా చోరీలు జరిగాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. ఒక మాల్ వేర్ ఏకంగా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ ని ఇన్ ఫెక్ట్ చేసింది. అది కూడా 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న యాప్స్ అవి.
ఇది స్మార్ట్ యుగం.. ఇప్పుడు అన్నీ స్మార్ట్ అయిపోయాయి. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ అంటూ అంతా స్మార్ట్ అయిపోతున్నారు. అయితే టెక్నాలజీ ఎంత పెరుగుతోందో.. దాని వల్ల రిస్క్ కూడా అంతే పెరుగుతోంది. ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిసొచ్చింది. ఇప్పటికే సైబర్ అటాక్స్ పేరుతో కోట్ల మంది డేటాను చోరీ చేశారు. ఎంతో మంది బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అంటే.. ఫ్రాడ్ చేసే వాళ్ల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త వింటే వణికిపోవాల్సిందే. ఎందుకంటే దీని తర్వాత మీకు ఏ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి అన్నా భయమేస్తుంది.
సాధారణంగా మాల్ వేర్, సైబర్ అటాక్స్ అనే పేర్లు మీరు వినే ఉంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. టెక్ కంపెనీలు వాటి నుంచి యూజర్లను కాపాడేందుకు సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్స్ ని కూడా తయారు చేశాయి. ఇప్పుడు టెక్ మార్కెట్ లో ‘గోల్డ్ సన్ మాల్ వేర్’ అటాక్ అనే పేరు బాగా వినిపిస్తోంది. దీని వల్ల ఫ్రాడ్ యాడ్స్ తో యూజర్లను పక్కదారి పట్టిస్తారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మొత్తం 63 యాప్స్ ఈ మాల్ వేర్ వల్ల ఇన్ ఫెక్ట్ అయినట్లు చెబుతున్నారు. ఇంకో దారుణం ఏంటంటే ఆ యాప్స్ ఒక్కోటి మిలియన్ కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ ‘మ్యాక్ ఫీ’ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం మొత్తం 63 యాప్స్ ఈ గోల్డ్ సన్ మాల్ వేర్ తో ఇన్ ఫెక్ట్ అయినట్లు తెలిపారు. ఇది ముఖ్యంగా ఫ్రాడ్ యాడ్స్ ద్వారా మీ డేటాను కలెక్ట్ చేస్తుంది. ఈ డేటాను ఉపయోగించి మీ ప్రొఫైల్ ని డూప్ చేసే అవకాశం కూడా ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకో దారుణం ఏంటంటే.. ఈ యాప్స్ లో కొన్ని ప్లే స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఏపీకే ఫైల్స్ ద్వారా డౌన్లోడు చేసుకునేందుకు వీలుంది. ముఖ్యంగా మీరు ఏ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నా ఏపీకే ఫైల్స్ నుంచి చేయడం మానేయాలి. ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేయాలి అనుకున్నా.. ముందుగా వారి డేటా పాలసీని పూర్తిగా చదువుకోవాలి.
ఈ యాప్స్ ద్వారా సాధారణంగా మే డేటా ప్రతి రెండ్రోజులకు ఒకసారి మాస్క్ డ్ సర్వర్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. మీరు ఇచ్చిన పర్మిషన్స్ ను బట్టి మీ వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేసేందుకు వీలుంటుంది. ఆండ్రాయిడ్ 11, ఆ తర్వాత వచ్చిన ఓఎస్ వర్షన్స్ లో తీసుకొచ్చి హై సేక్యూరిటీ ఫీచర్స్ ని కూడా అధిగమించి గోల్డ్ సన్ మాల్ వేర్ దాదాపు 10 శాతం యాప్స్ ద్వారా మీ డేటాను కలెక్ట్ చేయగలదని చెబుతున్నారు. కస్ట్ మైజ్డ్ వెబ్ వ్యూ ద్వారా హెచ్ టీఎంఎల్ కోడ్ లో యాడ్ క్లిక్కింగ్ యాక్టివిటీని చేస్తుంది. మీకు ఆ వెబ్ వ్యూ కనిపించదు. అసలు మీ ఫోన్ మాల్ వేర్ అటాక్ కు గురైందని గానీ, మీ డేటా ట్రాన్స్ ఫర్ అవుతోందని గానీ మీకు అస్సలు తెలియదు. ఎఫెక్ట్ అయిన యాప్స్ ఇవి కొన్ని.