ఇజ్రాయిల్ గురించి ప్రపంచానికి తెలియని 10 సంచలన నిజాలు!

ఇజ్రాయిల్.. ఇప్పుడు వార్తల్లో ఈ దేశం పేరు బాగా వినిపిస్తోంది. పాలస్తీనా పై పట్టువిడవకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ యూదు దేశం. తన చుట్టూ ఉన్న 7 అరబిక్ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గాజాపై కాల్పులు ఆపాలని.. ప్రపంచంలోని 53 ఇస్లామిక్ దేశాలన్నీ కలసి హెచ్చరించినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఇజ్రాయిల్. ఏకంగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా.. ప్రాణానికి ప్రాణమే సమాధానం. ఈ యుద్ధం ఆగదు అన్నట్టు వ్యవహరిస్తోంది. గట్టిగా కోటి మంది జనాభా కూడా లేని ఇజ్రాయిల్ కి ఇంత తెగింపు, ఇంత పౌరుషం, ఇంతటి పోరాట తత్వం ఎలా సాధ్యమైంది? వీటన్నింటికన్నా ముందు.. అసలు ఇజ్రాయిల్ దేశంగా ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం.

క్రీస్తు పూర్వం 10వ శతాబ్దాల్లో యూదుల సామ్రాజ్యం స్థాపించబడింది.1600 సంవత్సరాల తరువాత ఇక్కడ అరబ్ లు సంఖ్య ఎక్కువ అయ్యింది. తరువాత ఈ సామ్రాజ్యాన్ని రోమన్ లు తమ అధీనంలో తెచ్చుకున్నారు. రోమన్ లు ఇక్కడే యూదులు అందరినీ ఊచకోత కోయడం మొదలుపెట్టారు. కానీ.., అరబ్ లు మాత్రం రోమన్స్ పరిపాలనలో ఆనందగానే ఉంటూ వచ్చారు. దీనితో.. యూదులు అంతా తమ ప్రాంతాన్ని వదిలి.., ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రపంచదేశాలకి వలస వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది యూరప్ వెళ్లిపోయారు. కానీ.., ప్రపంచంలో ఎక్కడా వీరికి కనీస మర్యాద దక్కలేదు. ఎవ్వరూ వీరిని ఆదరించలేదు. బానిసలుగా మాత్రమే చూస్తూ వచ్చారు. కానీ.., ఒక్క ఇండియాలో మాత్రం యూదులకు గౌరవం దక్కింది. మిగతా ప్రజలు అందరిలానే వీరికి ఇక్కడ సమానమైన జీవితం లభించింది. అయినా.., ఎక్కువ మంది యూదులు మాత్రం బానిసలుగా యూరప్ లోనే ఉండిపోయారు. ఇక రెండో ప్రపంచయుద్ధ సమయంలో యూరప్ పై జర్మనీ విజయం సాధించింది. జర్మనీ నాయకుడు హిట్లర్. అతనికి యూదులు అంటే అస్సలు పడదు. ఇందుకే ఆ సమయంలో హిట్లర్ 60 లక్షల మందిని యూదులను ఊచకోత కోపించాడు. ఈ సంఘటన తరువాత యూదులు యూరప్ లో ఉండలేకపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మళ్ళీ తమ యూదు సామ్రాజ్యానికి వచ్చేశారు. కానీ.., అప్పటికే యూదు సామ్రాజ్యం అరబ్ ల చేతిలోకి వెళ్లిపోయింది.

యూదులు పట్టు విడవలేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడో బతుకుతున్న యూదులు అంతా తమ సామ్రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకోవాలి అనుకున్నారు. ఎక్కడి ఆస్తులు అక్కడే వదిలేసి అంతా యూదు సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. నిదానంగా.. అక్కడ యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తరువాత తమకి ఈ సామ్రాజ్యంలోనే ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించారు. ఆ ఉద్యమం అరబిక్ లు, యూదుల మధ్య యుద్ధంలా మారింది. దీనితో అప్పటి ఐక్యరాజ్యసమితి కల్పించుకుని.. అరబ్ లను పాలస్తీనీయులుగా, యూదులను ఇజ్రాయిలుగా గా విభజించింది. ఇలా యూదులు అంతా కలసి ఇజ్రాయిల్ దేశాన్ని సాధించుకున్నారు. ఇదంతా ఇజ్రాయిల్ దేశ ఏర్పాటు చరిత్ర. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

1) ఇజ్రాయిల్ అనేది విస్తీర్ణంలో చాలా చిన్న దేశం. ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే మన దేశంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో సగం ఉంటుంది ఇజ్రాయిల్. ఇక్కడ జనాభా కూడా కేవలం 90లక్షలు.

2) ప్రపంచం మొత్తాన్ని వణికించిన, వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు గురించి మీరు వినే ఉంటారు. అన్నీ దేశాల్లో వీరు అడుగు పెట్టారు. తమ కార్యక్రమాలు చేశారు. కానీ.., ఐసిస్ ఉగ్రవాదులకి మాత్రం ఇజ్రాయిల్ లో అడుగు పెట్టాలంటే భయం. ఇప్పటి వరకు ఐసిస్ ఇజ్రాయిల్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయింది.

3) ఇజ్రాయిల్ చుట్టూ 7 ముస్లీమ్ దేశాలు ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సింది ఇజ్రాయిల్ పతనమే. కానీ…, వాటన్నిటికీ ఇజ్రాయిల్ ని టచ్ చేయాలంటే భయం. ఎందుకంటే.. ఇజ్రాయిల్ దేశంలోనే 100వ అతి చిన్న దేశం. కానీ.., దాని వైమానిక దళం ప్రపంచంలోని అన్నీ శక్తివంతమైన వాటిల్లో ఒకటి. కేవలం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే దీనికన్నా బలంగా ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలో కల్లా.. వేగంగా నిర్ణయం తీసుకోగలిగిన ఆర్మీ ఇజ్రాయిల్ దే. దేశ రక్షణ కోసం ఇక్కడ సైనికులు ఎలాంటి నిర్ణయం అయినా స్పాట్ లో తీసుకోవచ్చు. మన దేశంలోలా.. రాజకీయనాయకుల పర్మిషన్స్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టే.. ఇజ్రాయిల్ ఇప్పటికే ఆ 7 ముస్లీమ్ దేశాలపై యుద్ధంలో విజయం సాధించింది.

4) మన దేశ రక్షణ కోసం రా అనే ఏజెన్సీ ఉన్నట్టే.., ఇజ్రాయిల్ వాళ్ళకి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంది. దాని పేరు మోసాద్. మోసాద్ అంటే మరణం అని అర్ధం. ఇజ్రాయిల్ కి హాని తలపెట్టే ఎవ్వరినీ ఈ మోసాద్ వదిలిపెట్టదు. మోసాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇంటెలిజెంట్ ఏజెన్సీ. దేశానికి వచ్చే ప్రమాదాలను వీరు కచ్చితంగా ముందే కనిపెడతారు. తమకి ద్రోహం చేసిన వారు ఏ దేశంలో దాగి ఉన్నా.., మారు వేషాల్లో వెళ్లి మరి వీరు శత్రువులను చంపేస్తారు.

5) ఇజ్రాయిల్ ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. తమకై తాము ఎవ్వరి జోలికి పోకూడదు. ఎవరైనా తమ దేశం జోలికి వచ్చినా, ప్రజలను చంపినా వారిని వదిలి పెట్టకూడదు. ప్రాణానికి ప్రాణం తీసేయాలి అన్నది ఇజ్రాయిల్ రూల్. ఇంతే కాదు.., ఎవరైనా తమ దేశంలో ఒక్క పౌరుడిని చంపితే.., శత్రు దేశంలో 50 మందిని చంపాలి అన్నది వీరి టార్గెట్.

isra 2

6) ఇక ఇజ్రాయిల్ లో పుట్టిన అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తప్పకుండా ఆర్మీ శిక్షణ తీసుకోవాల్సిందే. కొన్ని రోజులు ఆర్మీలో సేవలు అందించాల్సిందే. దీన్ని ఆ దేశ ప్రజలంతా తమ బాధ్యతగా భావిస్తారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, కోటీశ్వరులు అంతా ఈ రూల్ ని తప్పకుండా ఫాలో అవుతారు. సో ఇక్కడ ప్రజలు అందరూ సైనికులే.

7) ప్రపంచం మొత్తం మీద ఒక్క ఇజ్రాయిల్ లో మాత్రమే యాంటీ బెలాస్టిక్ డిఫెన్స్ సిస్టం అమర్చబడి ఉంది. అంటే.. ఇజ్రాయిల్ దేశంపై ఎవరైనా రాకెట్ ని గురి పెడితే.. ఈ యాంటీ బెలాస్టిక్ డిఫెన్స్ సిస్టం గాలిలోనే ఆ రాకెట్ ని పేల్చి వేస్తుంది. దీని కారణంగానే 1965 లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ 7 అరబిక్ దేశాల పై విజయం సాధించగలిగింది.

8) ఇజ్రాయిల్ సొంతంగా ఉపగ్రహ వ్యవస్థని కలిగిన 9వ దేశం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ దేశం తన ఉపగ్రహ వ్యవస్థ సమాచారాన్ని ఎవ్వరితో పంచుకోదు.

9) 1972లో జర్మనీలో ఒలంపిక్స్ జరిగాయి. ఇక్కడ.. 12 మంది ఇజ్రాయిల్ ఆటగాళ్ళని పాలస్తీనాకి చెందిన ముస్లీమ్ ఉగ్రవాదులు చంపేశారు.ఇది ఇజ్రాయిల్ కి అతి పెద్ద షాక్. కానీ.., అప్పుడు ఆ దేశ ప్రధాని శాంతి గీతాన్ని అందుకోలేదు. చనిపోయిన 12 మంది కుటుంబాలకి తానే స్వయంగా ఫోన్ చేశాడు. మన వాళ్ళని చంపిన ఏ ఒక్కరిని ఇజ్రాయిల్ వదిలి పెట్టదు. మీ అందరికీ ఇజ్రాయిల్ ప్రధానిగా నేను మాట ఇస్తున్నాను. ఈ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే.., వారం రోజుల్లో వారిని చంపేస్తాము. అలా జరగని పక్షంలో నేను ప్రధానిగా ఉండనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రధాని ప్రకటన తరువాత ఆ దేశ మోసాద్ ఏజెంట్స్ రంగంలోకి దిగారు. 4 రోజులు.. ఒక్కరికి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. ఒక్కరూ తిండి కూడా సరిగ్గా తినలేదు. ఆ దేశ ప్రధానితో సహా.
కానీ.., 5 వ రోజుకి తీవ్రవాదుల స్థావరాన్ని కనుగొన్న ఇజ్రాయిల్ వారి మీద బాంబ్ ల వర్షం కురిపించింది. ఇలా ఉంటుంది ఇజ్రాయిల్ పట్టుదల.

10) ఇక పాకిస్థాన్ ని, ఇండియాని ఇజ్రాయిల్ ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్థాన్ ప్రజలకి ఇజ్రాయిల్ లోకి అనుమతి లేదు. ఎందుకంటే.. వీరు పాలస్తీనా ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూరుస్తున్నారని ఇజ్రాయిల్ నమ్మకం. కానీ.. ఇండియా పేరు చెప్తేనే ఇజ్రాయిల్ పులకించిపోతుంది. ఇజ్రాయిల్ దేశంలో ఇండియన్స్ ని దేవుళ్లుగా చూస్తారు. వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి సకల మర్యాదలు చేస్తారు. ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏమిటో తెలుసా..? ఇండియా మన చిరకాల మిత్ర దేశం. వారు ఎప్పటికీ మన మిత్రులే. ఎట్టి పరిస్థితిల్లో వారిని వ్యతిరేకించరాదు అని ఇజ్రాయిల్ ఏకంగా తన రాజ్యాంగంలోనే పొందపరుచుకుంది. ప్రపంచంలో ఏ దేశానికి తల వంచని ఇజ్రాయిల్ మనకి మాత్రమే ఇంత గౌరవం ఎందకు ఇస్తోందో తెలుసా? ఒకప్పుడు తమ సామ్రాజ్యాన్ని పోగొట్టుకొని.., ప్రపంచం అంతా శరణార్థులుగా తిరుగుతున్న యూదులను అన్నీ దేశాలు హీనంగా చూశాయి. కానీ.., ఒక్క ఇండియా మాత్రమే వారికీ దేశంలో సమాన హక్కు కల్పించింది. వారిని సోదరులుగా భావించింది. ఈ ఒకే ఒక్క కారణంతో ఇజ్రాయిల్ శతాబ్దాలుగా ఇండియాని, ఇండియన్స్ ని ప్రేమిస్తూ వస్తోంది.