తల తెగిపడితే ప్రాణాలు పోతాయి. కానీ కారు ప్రమాదంలో బాలుడి తల దాదాపు మొండెం నుంచి వేరైతే వైద్యులు తిరిగి తలను అమర్చి బాలుడి ప్రాణాలు కాపాడారు.
ఈ సృష్టిలో మనిషికి దొరికిన అద్భుతమైన వరం వైద్యం. వైద్యం లేకపోతే మనిషి మనుగడ అనేదే ఉండదు. చిన్న చిన్న రోగాల నుంచి పెద్ద పెద్ద రోగాల వరకూ చాలా వరకూ వైద్యం మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. ఆ యముడు ప్రాణాలను తీస్తే ఈ వైద్యులు ప్రాణం పోస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అని అంటారు. ఆ పరమ శివుడు వినాయకుని శిరస్సు ఖండించి.. ఏనుగు తల పెడితే.. వైద్యులు తెగిపడిన తలను అతికించి బాలుడ్ని అమరుడ్ని చేశారు. అసలు తల, మొండెం వేరైతే ప్రాణం పోతుంది. ఒక బాలుడ్ని ఒక కారు గుద్దితే తల, మొండెం దాదాపు వేరయ్యాయి. కానీ డాక్టర్లు మాత్రం తెగిన తలను తిరిగి అతికించారు.
ఈ అద్భుతం ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. సులేమాన్ హాసన్ అనే 12 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతుంటే ఒక కారు వచ్చి గుద్దేసింది. దీంతో బాలుడి వెన్నుపూస నుంచి పుర్రె భాగానికి ఉండే జాయింట్ తెగిపోయింది. తల, మెడ మొండెం నుంచి వేరయ్యాయి. దీన్ని సైంటిఫిక్ గా బిలాటరల్ అట్లాంటో ఒక్కిపిటల్ జాయింట్ డిస్లొకేషన్ అని అంటారు. ఈ ఘటన తర్వాత బాలుడ్ని హదస్స మెడికల్ సెంటర్ కి తీసుకెళ్లగా వైద్యులు అత్యవసర సర్జరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో తలను తిరిగి అతికించారు. బాలుడి తల దాదాపు మొండెం నుంచి వేరు పడిందని అన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒహాడ్ ఐనవ్ ఈ సర్జరీతో పాల్గొన్నారు. ఈ సర్జరీ చేయడానికి తమకు చాలా సమయం పట్టిందని అన్నారు.
బాలుడి ప్రాణం కోసం మా బృందమంతా పోరాడిందని.. నాలెడ్జ్ కి, ఇన్నోవేటివ్ టెక్నాలజీకి కృతజ్ఞతలు అని అన్నారు. బాలుడు బతికే అవకాశం 50 శాతం మాత్రమే ఉందని.. ఇది అద్భుతం అని అన్నారు. అయితే ఈ సర్జరీని గత నెలలో చేశారు వైద్యులు. సర్జరీ విజయవంతమవ్వడంతో జూలైలో ఈ విషయాన్ని బయటపెట్టారు. సులేమాన్ హాసన్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బాలుడి తండ్రి వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన కుమారుడ్ని బతికించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. అయితే ఇది అందరి డాక్టర్ల వల్ల అవ్వదని.. దీనికి నాలెడ్జ్, టెక్నాలజీ అవసరమని డాక్టర్లు అన్నారు. మరి తెగిపడిన తలను అతికించిన డాక్టర్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.