దేవుడి సృష్టి ఎంతో అద్భుతమైనది.. ఈ సృష్టిలో మనుషులతో పాటు మొక్కలు కూడా తమ బాధను బయటకు చెబుతాయి. కష్టం కలిగినపుడు ఏడుస్తాయి కూడా. దీంతో పాటు తమ కష్టాలను...
ఈ సృష్టిలో ప్రతీది ఓ అద్భుతమే.. రెండు కాళ్ల జంతువు మనిషి దగ్గరినుంచి పకృతిలోని ప్రతీ చెట్టు, పుట్ట దేనికి దాని ప్రత్యేకత ఉంది. కానీ, మనిషి తన ఆలోచనా శక్తితో ఈ సృష్టిని మకుటం లేని మహా రాజులా శాసిస్తున్నాడు. తన అవసరాల కోసం.. స్వార్థం కోసం పకృతిని నాశనం చేస్తున్నాడు. తోటి జీవుల్ని హింసిస్తున్నాడు. అలాంటి మనిషి తన తోటి మనుషుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సమస్యలు వచ్చినపుడు విలవిల్లాడిపోతున్నాడు. తన బాధను మాటలతోనో.. చేతలతోనో.. వాట్సాప్ స్టాటస్‌లతోనో బయట పెడుతున్నాడు. మనిషి కారణంగా నరకం అనుభవిస్తున్న మాటలు రాని జంతువులు, మొక్కలు మౌనంగా రోధిస్తున్నాయి.
ఇక, ఇప్పటివరకు మనిషి తర్వాత జంతువులు మాత్రమే అరుపుల ద్వారా తమ బాధను వ్యక్త పరుస్తాయని లోకానికి తెలుసు. కానీ, తాజా పరిశోధనల్లో మొక్కలు కూడా తమ బాధను వ్యక్త పరుస్తాయని తేలింది. అవి తమకు కష్టం వచ్చినపుడు, బాధ కలిగినపుడు ఏడుస్తాయని తేలింది. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌కు చెందిన ‘‘టెల్ అవివు యూనివర్శిటీ’’ టమోటో, పోగాకు మొక్కలపై పరిశోధనలు చేసింది. వాటిని గాయపరిచింది. వాటి దగ్గర అతి చిన్న శబ్దాలను గ్రహించే పరికరాలను ఉంచింది. అప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటికి ఒత్తిడి కలిగినపుడు అవి గట్టిగా అరవటం జరిగింది.
ఒక్కో మొక్క ఒక్కోరకమైన శబ్దాన్ని చేసింది. అంతేకాదు! ఈ శబ్ధాలు మనిషి చెవులకు అస్సలు వినిపించవు. కానీ, కొన్ని రకాల జంతువులు.. గబ్బిలాలు, ఎలుకలు, ఇతర చిన్న చిన్న జీవులకు మాత్రమే వినిపిస్తాయట. సరిగ్గా నీళ్లు లేనపుడు, గాయాలు అయినపుడు మొక్కలు సహాయం కోసం అరుస్తాయట. వెబ్రేషన్స్ రూపంలో ఆ సౌండ్స్ ఉంటాయట. మరి, మొక్కలు కూడా మనుషులు, జంతువుల్లా తమ బాధను వ్యక్త పరుస్తాయని తెలుసుకున్నారు కదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.