ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దర్శనం అనంతరం కారులో కాణిపాకం వెళ్తుండగా చంద్రగిరి మండలం కల్రొడ్డు పల్లి వద్ద కల్వర్టును ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారులో సుమారు 9 మంది భక్తులున్నారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను రుయా […]
హైదరాబాద్ లోని జెఎన్ టియులో విద్యార్థిని మృతి మర్చిపోక ముందే.. మరో యూనివర్శిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ)లో చదువుతున్న అంజలి అనే విద్యార్థిని హాస్టల్ బిల్లింగ్ పై నుండి దూకి చనిపోయింది. ఈ మృతి వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్లూ వద్దకు చేరుకుని, దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు […]
అవయవదానం గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఆర్గాన్ డోనేషన్ కి ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పటికీ గుండె కానీ, కిడ్నీ కానీ మార్చాలంటే.. సదరు బాధితులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పోనీ ఆస్తులు అమ్ముకుంటామన్నా.. అవి దొరికే పరిస్థితులు చాలా అరుదు. దీంతో అవయవాలు దొరక్క, ఆపరేషన్ చేయించుకోలేక అనేక మంది చనిపోయిన వారున్నారు. వారిలో ఒకరు నటి మీనా భర్త విద్యాసాగర్. ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు […]
ఆంధ్రప్రదేశ్ తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక రేషన్ కార్డుపై రాగులు, జొన్నలు తీసుకోవచ్చు. వాటిని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు అందించే విషయమై వాలంటీర్లతో సర్వే చేపట్టామని అన్నారు. రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరానని, తొలుత రాయల సీమ జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. దశల వారీగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన రాగులు, జొన్నలు […]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్వాలిటీలోనూ, క్వాంటిటీలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా రుచికరమైన భోజనం కోసం భారీగా ఖర్చు పెడుతుంది. అయితే కొంతమంది బుద్ధి గడ్డి తిని అన్నం దగ్గర కూడా కక్కుర్తి పడుతున్నారు. పిల్లలకి మంచి భోజనం పెట్టకుండా నామ మాత్రంగా పెట్టేసి.. అద్భుతంగా పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అధికారులు తనిఖీలకు వెళ్తేనే గాని వీళ్ళ అసలు రంగు బయటపడదు. తాజాగా ఓ మహిళా […]
ఠాగూర్ సినిమాలో ‘కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. అచ్చం ఇలానే ఓ ఈ కామర్స్ షాపింగ్ వెబ్సైట్ ఆ డైలాగ్ కి తగ్గట్టు ఓ వింత పని చేసింది. “బట్టలు విప్పడం మీ అలవాటు, బట్టలు వేయడం మా అలవాటు” అనే అర్ధం వచ్చేలా ఓ సరికొత్తగా తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో అమెజాన్ అని, ఫ్లిప్ కార్ట్ అని చాలా […]
ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా లింగ భేదాల దగ్గరే ఆగిపోతున్నారు. అమ్మాయి పుడితే ఏదో అరిష్టం అన్నట్టు చూసే జనం ఇంకా మన చుట్టూ ఉండడం నిజంగా దురదృష్టం. వారసుడి కోసం కొందరు పుట్టబోయే ఆడ బిడ్డల్ని పురిట్లోనే చంపేస్తున్నారు. కొందరు అబ్బాయి పుట్టే వరకూ భార్యని పిల్లల్ని కనే యంత్రంగా మారుస్తున్నారు. ఇంకొందరైతే మగ సంతానం కోసం ఏకంగా నర బలులు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో కియోటి […]
ఈ మద్య వ్యాపారస్తులు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్‌లు విసరడం ప్రారంభించాయి. ఏపిలో ఇటీవల బాహుబలి థాలి చాలెంజ్ విసిరారు. ఇది తిన్నవారికి లక్ష బహుమతి ఇచ్చారు. ఇలాంటి చాలెంజ్ లు ఈ మద్య పలు జోట్ల జోరందుకున్నాయి. తాజాగా యూపీలోని మీరట్ లో ఓ స్వీట్ షాప్ లో సమోసా చాలెంజ్ విసిరాడు. వివరాల్లోకి వెళితే.. దేశంలో సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆలు, ఆనియన్, కార్న్ ఇలా రక రకాలుగా […]
టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చిత్తూరు తరలిస్తన్నారు. నారాయణ సొంత బెంజ్ కారు 8888లోనే ఆయనను చిత్తూరు తీసుకెళ్తున్నారు. అయితే నారాయణను ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్న లీకేజీ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి 27) లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఐదోసారి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో రాజధాని డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.11, […]