ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్వాలిటీలోనూ, క్వాంటిటీలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా రుచికరమైన భోజనం కోసం భారీగా ఖర్చు పెడుతుంది. అయితే కొంతమంది బుద్ధి గడ్డి తిని అన్నం దగ్గర కూడా కక్కుర్తి పడుతున్నారు. పిల్లలకి మంచి భోజనం పెట్టకుండా నామ మాత్రంగా పెట్టేసి.. అద్భుతంగా పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అధికారులు తనిఖీలకు వెళ్తేనే గాని వీళ్ళ అసలు రంగు బయటపడదు. తాజాగా ఓ మహిళా అధికారి పుణ్యమా అని ఓ ప్రభుత్వ పాఠశాల క్యాంటీన్‌లో విద్యార్థులకి మంచి భోజనం పెట్టడం లేదన్న విషయం బయటపడింది.
విద్యార్థులకు భోజనం విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న వార్డెన్‌పై మహిళా అధికారి నిప్పులు చెరిగారు. క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. ఎన్ని రోజులు నోరు మూసుకుని ఉంటాను. నా దగ్గర నుండి వేలకి వేలు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. పిల్లలకి చూస్తే క్వాలిటీ, క్వాంటిటీ లేని భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి. మీ పిల్లలకి ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్‌ను కడిగిపారేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మహిళా అధికారి నిజాయితీకి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.