థియేటర్స్ లోకి దండెత్తి వస్తోన్న సంపూ ‘బజారు రౌడీ’!.

ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల  తర్వాత సంపూర్ణేష్‌ బాబు ‘బజార్‌ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు.  హైదరాబాద్‌ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్‌ పోస్టర్‌, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్‌ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై సిగిరెట్‌ వెలిగిస్తూ ఉన్న సంపూర్ణేష్‌ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది.

bajar Rowdy 01 minసంపూ అత్తమామలను అల్లరి పెట్టే పాత్రలో అదరగొట్టబోతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో సంపూ ఉన్నట్లు తెలుస్తోంది.   చిత్రాన్ని ఆగస్టులో ధియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు వసంత నాగేశ్వరరావు వెల్లడించారు.  కేఎస్ పతాకం  బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటికే పబ్లిక్ లో మాంచి క్రేజ్ ఉంది. టీజర్ లో సంపూర్ణేష్ బాబు డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  ఆగస్ట్ లో విడుదల చేయాలని చిత్ర బృందం సిద్దం చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సందిరెడ్డి  ప్రేక్షకుకు నచ్చేవిధంగా నవ్వులు, పాటలు, ఫైట్స్ అన్ని కలకలిపి చిత్రాన్ని రూపొందించాం అని అన్నారు.

సంపూ స్టైల్ ని యూడ్ చేసి ఈ చిత్రాన్ని కుటుంబకథా చిత్రంగా తీర్చిదిద్దారు అని నిర్మాత అన్నారు. నాగేశ్వరరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తెచ్చారని వెల్లడించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో సంపూకి, నిర్మాతకు దర్శకుడు వసంత నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇంకా షియాజీ శిండే, పృథ్వి, కత్తిమహేష్, నాగివీడు, పద్మావతి కీలకపాత్రల్లో నటించినట్లు సమాచారం. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో సంపూర్ణేష్‌ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. మరి రౌడీయిజంతో కామెడీ పండించాలని చూస్తోన్న సంపూ  ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.