ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]
విజయ్ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. తెలుగులో ఇప్పటి వరకు ఉప్పెన, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రాలన్నీ […]
అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. అఖిల్ లుక్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ లుక్ కంప్లీట్‌గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న అఖిల్ ఫోటోను రిలీజ్ చేస్తూ ‘ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ’ అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. […]
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి […]
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వెర్సైట్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తొకటి హల్‌చల్ చేస్తుంది. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని నటింప చేయాలని మేకర్స్ […]
బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. […]
కధ ఒక హీరోకి చెప్పినా డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గానీ, ఇమేజ్ ని దృష్టిలోపెట్టుకుని గానీ ఆ హీరో ఆ కధ చేయకపోవచ్చు. ఇండస్ట్రీలో ఒకరితో చేయాల్సిన కథను మరో హీరోతో చేయడం అనేది చాలా కామన్. ఇప్పటికే చాలామంది సినిమాలు అలా తీసి హిట్లుకూడా కొట్టారు. దాంతో ఆసినిమా తాము ముందు చేసి ఉంటే బాగుండేదని ఆ హీరోలు బాధపడటం కూడా పరిపాటి. ఇప్పుడు ఇదే కోవలో అన్నతో చేయాల్సిన కథను తమ్ముడితో చేస్తున్నాడో […]
స్పేస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా ‘ఛాలెంజ్’. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని […]
చెన్నై సుందరి రెజీనా ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. ‘ఎవరు’ హిట్ తర్వాత తెలుగులో సినిమాలలో కనిపించని రెజీనా ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. చిరంజీవి ‘ఆచార్య’లో ఓ పాటలో కనిపించనున్న రెజీనా తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి విడుదలకు రెడీగా ఉంది. ‘పార్టీ, కల్లాపార్ట్, కసాదా తప్పర, శూర్పణగై’ పేర్లలో అవి తెరకెక్కుతున్నాయి. ఇక తెలుగులోనూ ‘నేనా నా’, ‘మిడ్ నైట్ మర్డర్స్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఓ క్రేజీ […]
సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు. అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటాడు హీరో నాని. వరుస […]