వలస వచ్చి మరీ మంటల్లోకి దూకీ ‘హరీ’ అంటోన్న ‘హరికిరి’ పక్షులు!..

కొన్ని పక్షుల విషయాలకొస్తే అవి వలస పోతూ వాటికి నచ్చిన ప్రాంతాలలో సేద తీర్చుకుంటాయి.కొన్ని రకాల పక్షులు తమకు కావాల్సిన సదుపాయాలు ఉన్నచోటే తమ గూటిని నిర్మించుకుంటాయి. ఇలా ప్రతి ఒక్క పక్షి తమకు అనుకూలంగా ఉన్న చోట ఉండటమే కాకుండా ఏకంగా పక్షుల సమూహాన్నే చేస్తాయి.ఇక ఇదిలా ఉంటే ప్రతి ఒక్క పక్షి తమ ప్రాణాల రక్షణ కోసం ఉంటుండగా ఓ జాతికి చెందిన పక్షులు మంటల్లోకి దూకి ప్రాణాలు విడుస్తాయన్న విషయాన్ని అందరిని బాధపడేలా చేస్తుంది. హప్లాంగ్‌ చిన్న పట్టణం – సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో, గువాహటి నగరానికి 355 కి.మీ.ల దూరాన ఉంది. పాశ్చాత్య టూరిస్టులు ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్‌తో పోలుస్తూ ‘స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అన్నారు. హఫ్లాంగ్‌ టూర్‌లో ప్రధానమైన విశేషం హఫ్లాంగ్‌ సరస్సు. ఇది మంచి నీటి సరస్సు. నీళ్లు, పడవ కనిపిస్తే పిల్లలు ఊరుకోరు కాబట్టి పిల్లలతో టూర్‌కెళ్లిన వాళ్లు ఎలాగూ బోటు షికారు చేసి తీరతారు. కానీ మేఘాలు చేతికి అందుతాయేమో అన్నట్లుండే హఫ్లాంగ్‌ కొండ మీద బోటు షికారు చేయడం పెద్దవాళ్లకు కూడా మధురానుభూతిగా మిగులుతుంది.  హప్లాంగ్‌ పూర్తిగా ఆదివాసీల నేల. మిజో, నాగా, దిమాసా, మిమార్, కుకి, హ్రాంగ్‌కోల్‌ వంటి తెగల వాళ్లుంటారు. అస్సామీల క్యాలెండర్‌ ప్రకారం ఏడాది మొదలయ్యే బోహాగ్‌ పండుగ సందర్భంగా బిహు ఫెస్టివల్‌ వేడుకగా నిర్వహిస్తారు.

a27d24 cad19de86a2646be96a0ecbfbcfc08f8 mv2

హఫ్లాంగ్‌ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉన్న జతింగ గ్రామాన్ని మిస్‌ కాకూడదు. ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పక్షులు వలస వస్తాయి. ఇప్పటి వరకు నలభై నాలుగు రకాల వలస పక్షులను గుర్తించారు. ఇక్కడికి వచ్చే హరికిరి పక్షులు మంటల్లోకి దూకుతాయి. అవి ఎందుకు వస్తాయో, ఎందుకు మంటల్లో దూకుతాయో ఎంతకీ అంతుపట్టని మర్మంగానే ఉంది. పొగమంచులో చక్కర్లు కొడుతూ కాలుతున్న మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి. ఈ పక్షుల మీద అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికా, జపాన్‌దేశాల నుంచి ఏటా ఆర్నిథాలజిస్టులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరుకి వచ్చే కొంగలు, పులికాట్‌ సరస్సుకి గూడబాతులు సీజన్‌లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతోపాటు తిరిగి వెళ్లిపోతాయి. అలా చక్కగా వచ్చి వెళ్తుంటే చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ జతింగకు వచ్చే పక్షులు తుదిశ్వాస కోసమే వస్తున్నాయని తెలిసినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది.