షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కస్టమర్లతో ఎప్పుడూ రద్దీగా ఉండే మాల్ లో మంటలు చెలరేగడంతో అక్కడ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి దూకేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. నిర్లక్ష్యం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భయానక వాతావరణాన్ని కలిగించింది. ప్రయాణికుల అప్రమత్తతతో ఘోర ప్రమాదం తప్పింది. నగరంలో రెండ్రోజుల క్రితం సుబ్బయ్య గారి హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సకాలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో హోటల్ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు భవనం నుంచి కిందికి దూకేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గ్రేటర్ నోయిడాలో ఉన్న గెలాక్సీ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ లో ఆకాస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిప్రమాదం మూడో ఫ్లోర్ లో చోటుచేసుకోవడంతో అందులో ఉన్న వారు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు చెలరేగుతుండటంతో థర్డ్ ఫ్లోర్ నుంచి కొందరు వ్యక్తులు కిటికీలోంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో వారికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక స్థానికులు ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయ్యుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఈ భవనంలో ఎంతమంది ఉన్నారు, ఎంత మంది గాయపడ్డారు, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
#Watch Dramatic visuals Fire broke out on the third floor of galaxy plaza, gaur avenue 1, #GreaterNoida. People saved their lives by jumping from the building. @noidapolice pic.twitter.com/pAFL7KySYR
— Sanjay Jha (@JhaSanjay07) July 13, 2023