‘స్టూడెంట్ నెంబర్.1’ సినిమా తరహాలో జైలులో కష్టపడి చదివి తన లక్ష్యాన్ని సాధించాడో విద్యార్థి. కొన్ని ఏళ్ల క్రితం గౌహతి బాంబు కేసులో అరెస్టయిన విద్యార్థి.. జైలులో చదువును కొనసాగించాడు. తన ప్రతిభాపాటవాలను చూపించి గోల్డ్ మెడల్ సాధించాడు.
సాధారణంగా పిల్లలకు అన్ని వసతులు సమకూర్చినా కూడా కొందరు పిల్లలు చదువులో వెనకబడతారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివి అభివృద్ధి సాధించాలని ఆరాటపడతారు. కానీ పిల్లలు మాత్రం చదువులో రాణించలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆశలను నీరుగారుస్తారు. అయితే కొందరు విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లా రాణిస్తారు. వారికి ఎటువంటి సదుపాయాలు లేకున్నా అత్యంత ప్రతిభను కనబరుస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు అరకొర సౌకర్యాలు ఉండి.. హాస్టల్స్‌లో ఉండి తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. అంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారి ప్రతిభాపాటవాలు కనబరుస్తారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసి తమ లక్ష్యాలను చేరుకుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ విద్యార్థి.. కొన్ని కారణాలవల్ల జైలుకు పోవలసి వచ్చింది. అయినా తను చదువును కొనసాగించి గోల్డ్ మెడల్ సాధించాడు. తన లక్ష్యాన్ని చేరుకున్న ఆ విద్యార్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెంబర్.1’ సినిమా తరహాలో జైలులో కష్టపడి చదివి తన లక్ష్యాన్ని సాధించాడో విద్యార్థి. అస్సాం రాజధాని గౌహతిలో కొన్ని సంవత్సారాల క్రితం బాంబు పేలుళ్ల కేసులో ఒక స్టూడెంట్ లీడర్ సంజీవ్ అరెస్ట్ అయ్యాడు. తర్వాత జైలులో చదువు కొనసాగించాలని సంజీవ్ తాలుక్ దార్ అనుకున్నాడు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ పూర్తి చేశాడు. ఈ విద్యార్థి యూనిర్సిటీ పరిధిలో ఎక్కువ మార్కులు పొంది గోల్డ్ మెడల్ సాధించాడు. పీజీలో ఎం.ఏ సోషియాలజీ కోర్సును పూర్తి చేశాడు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇలా కష్టపడి చదివి తన కెరియర్ పరంగా సక్సెస్ సాధించాడు. అతని ప్రతిభను చూసిన జైలు అధికారులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
కొత్త కొత్త విషయాలపట్ల ఆసక్తి చూపే సంజీవ్ గురించి జైలు అధికారులు వెల్లడించగా ఆయా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజీవ్ గోల్డ్ మెడల్ సాధించడం అతని కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇతని జీవితం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం. సంజీవ్ జైలులో కాకుండా బయట ఉండి ఉంటే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే వాడని నెటిజన్లు కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు. జైలు అధికారుల నుంచి సహాయసహకారాలు లభించడం వల్ల కెరీర్ పరంగా సక్సెస్ సాధించాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై మీ
కామెంట్స్‌ని తెలియజేయండి.