కంగనాకు కరోనా పాజిటివ్!..

కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ఓ ఫైర్ బ్రాండ్ అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల్లో కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాల్లో తన నటనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం లభించింది. కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. కంగనా ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. అది అలా ఉంటే ఆమెకు కరోనా సోకిందని తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్పంగా అస్వ‌స్థ‌త‌, క‌ళ్ల‌లో మంట‌గా అనిపిస్తుండ‌టంతో శుక్ర‌వారం ఆమె క‌రోనా నిర్ధార‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. శ‌నివారం ఉద‌యం వెల్ల‌డైన ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో కంగనా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కంగనా  తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ‘ఏక్ నిరంజన్‌’ సినిమాలో ప్రియురాలు ‘సమీర’గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్‌లు విడుదలయ్యాయి. అంతేకాదు మంచి ఆదరణ పొందాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాను ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

.