గృహమే కదా స్వర్గసీమ!..

కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి కొంత కారణం ఇంటివాతావరణమే. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో బూజులు, విరిగిన వస్తువులు, పనికిరాని వస్తువులు కనబడేసరికి చిరాకు స్థానంలో కోపం వస్తుంది. అది అరుపులకి దెబ్బలాటలకి దారి తీస్తుంది. అందుకే ఓ వారాంతంలో భార్యకి ఇంట్లో సాయం చేయండి. కిటికీలకు, గుమ్మాలకు ఉపయోగించే పరదాలు, సోఫా కవర్స్‌, బెడ్‌షీట్స్‌ వంటివి పదిహేను రోజులకోసారైనా శుభ్రం చేయాలి. అలాగే కిచెన్‌లో ఉపయోగించే న్యాప్‌కిన్స్‌, డోర్‌మ్యాట్స్‌ వంటివైతే వారానికి రెండుసార్లు మార్చడం ఉత్తమం. ఎందుకంటే వీటిపై తడి చేరుతుంటుంది కాబట్టి బ్యాక్టీరియా, వైరస్‌ లాంటివి వాటికి త్వరగా ఆకర్షితమవుతాయి. అలాగే ఇంట్లో వేలాడదీసే పారదర్శక పరదాలు, బీడెడ్‌ కర్టెన్స్‌ వంటివి కూడా నెలకు రెండుసార్లు శుభ్రం చేయడం వల్ల వాటిలో దుమ్ము పేరుకునే అవకాశం ఉండదు. ఇల్లంతా శుభ్రం చేయడం ఒకెత్తయితే కిచెన్‌ను శుభ్రం చేయడం ఒకెత్తు. ముఖ్యంగా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, సింక్‌ వంటివి ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే స్టౌ వెనకభాగంలోని టైల్స్‌పై నూనె మరకలు పడి ఆ ప్రదేశమంతా జిడ్డుగా మారుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఆ టైల్స్‌ని కూడా రోజూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. రోజూ వృత్తి ఉద్యోగాలతో పరుగులు తీసే వారు వారాంతాల్లో ఇలాంటి పనులు పెట్టుకుంటే మీ భాగస్వామీ మీకు సహాయపడే వీలుంటుంది. తద్వారా పని సులభంగా పూర్తవుతుంది. అలాగని అందుకోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.