ప్రేయసితో సంతోషంగా గడుపుదామని వెళ్లిన ప్రియుడికి ఊహించని షాక్ తగిలింది. ఆమె తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు. ప్రియురాలి తల్లి చేతిలో చీపురు దెబ్బలు తిన్నాడు.
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. క్షణ కాలంలో పుట్టిన ప్రేమ రెండు మనసులను దగ్గర చేస్తుంది. ప్రేమకు వయసు, కులం, ఆస్థి, అంతస్తు ఇవేమీ అడ్డుకావు. ప్రేమించిన ప్రియుడిని లేదా ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ఎంత కష్టాన్ని అయినా భరించడానికి సిద్ధమవుతారు ప్రేమికులు. ప్రేమే లోకంగా ప్రపంచాన్ని మరిచి విహరిస్తుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢ ప్రేమలో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలో ఓ ప్రియురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రియురాలి పేరెంట్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రియుడు మూడో అంతస్తు నుంచి తాడు సాయంతో దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ప్రియుడికి ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడ్ని ఇంటికి ఆహ్వానించింది ఓ ప్రియురాలు. ఇంటికి చేరుకున్న ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె పేరెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.
దీంతో షాక్ అయిన యువతి ప్రియుడ్ని బాల్కనీ నుంచి పారిపొమ్మని సూచించింది. మూడో ఫ్లోర్ బాల్కనీ నుంచి తాడు సాయంతో కిందికి దిగుతున్న ప్రియుడ్ని ప్రియురాలి తండ్రి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ చిక్కకుండా తప్పించుకున్నాడు. కానీ అదే సమయంలో కింది ఫ్లోర్ లో సిద్ధంగా ఉన్న ఆమె తల్లికి చిక్కాడు. తాడుతో కిందికి జారుతున్న అతడిని చీపురుతో ఎడాపెడా వాయించింది. ఈ తతాంగాన్ని అంతా వీడియో తీసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr
— Enezator (@Enezator) August 10, 2023