ఆకాశం విరిగిపడినా, తుఫాను వచ్చి కొట్టుకుపోయినా మేం ఇంతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు కొంతమంది లవర్స్. జనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా బహిరంగ రొమాన్స్ తో రెచ్చిపోతుంటారు.
ప్రేమలో పడిన యువతీ యువకులు లోకాన్ని మరిచి ప్రవర్తిస్తుంటారు. ప్రేమే లోకంగా బ్రతికేస్తుంటారు. రోజంతా ఫోన్లో చాటింగ్, కాల్స్ తో గాఢమైన ప్రేమలో మునిగితేలుతుంటారు ప్రేమికులు. చేతిలో బైక్ ఉందా.. పక్కనే ప్రేమించిన అమ్మాయి ఉందా.. ఇక ఆ యువకుడు ఎందుకు ఆగుతాడండీ.. బైక్ పై గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకుని రయ్ రయ్ మంటూ రోడ్లపై జెట్ స్పీడ్ తో దూసుకెళ్తాడు. బైక్ పై వెళ్తూ.. బహిరంగంగానే ముద్దుల్తో హగ్గుల్తో చెలరేగిపోతుంటారు కొంతమంది లవర్స్. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇలాగే బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసిన జంటకు ఊహించని షాక్ తగిలింది. అసలు ఏం జరిగిందంటే..
ఈ రోజుల్లో ప్రేమ పక్షులు పార్కుల్లో, జనావాసాల్లో బహిరంగంగానే తిరుగుతూ హద్దులు దాటి ముద్దుల్లో మునిగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్ పురి సమీపంలో ఓ ప్రేమ జంట బైక్ పై.. మేఘాలలో తేలి పొమ్మన్నది.. తుఫానులా రేగి పొమ్మన్నది.. అమ్మాయితో సాగుతూ చిలిపి మది.. అని అన్నట్లుగా రోడ్డుపై ప్రయాణిస్తూ హల్ చల్ చేశారు. బైక్ రన్నింగ్ లో ఉండగానే ఆ యువతీ యువకుడిని కౌగిలించుకుని కిస్సులతో రచ్చ చేశారు. ఈ తతంగాన్నంత వారి వెనకాలే వస్తున్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో దృష్యాలను ఘజియాబాద్ పోలీసులకు పంపించాడు. ఈ ఘటన జూలై 16న చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ ప్రేమ జంటకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించేలా వ్యవహరించిన లవర్స్ ను గుర్తించి వారికి రూ. 11000 జరిమానా వేశారు. అంతే కాకుండా పరిమితికి మించిన స్పీడు ఇంకా ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.