ఇప్పటి హీరోయిన్లు గ్లామరస్ ఒలికించడంలో ఏ మాత్రం వెనుకాడం లేదు. కాంపిటీషన్ ఉండటంతో పాటు మడి కట్టుకుని కూర్చుంటే వచ్చిన ఆఫర్లు కూడా పోతాయన్న ఆందోళనతో రొమాన్స్ సీన్లకు కూడా అంగీకరిస్తున్నారు. అందుకు ఉదాహరణ తమన్నానే
ఇప్పటి హీరోయిన్లు గ్లామరస్ ఒలికించడంలో ఏ మాత్రం వెనుకాడం లేదు. కాంపిటీషన్ ఉండటంతో పాటు మడి కట్టుకుని కూర్చుంటే వచ్చిన ఆఫర్లు కూడా పోతాయన్న ఆందోళనతో రొమాన్స్ సీన్లకు కూడా అంగీకరిస్తున్నారు. అందుకు ఉదాహరణ తమన్నానే. ఇప్పటి వరకు ఒక్క హీరోకు కూడా ముద్దు ఇవ్వని ఈ మిల్కీ బ్యూటీ..లస్ట్ స్టోరీస్ -2లో తన లవర్ విజయ్ వర్మకు గాఢ చుంబనాన్ని అందించింది. మునుపెన్నడూ లేని విధంగా బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయింది. సినిమాలు తగ్గడంతో పాటు జూనియర్స్ రాకెట్ వేగంతో దూసుకు వస్తూనే అందాల ఆరబోతను ప్రదర్శిస్తుండటంతో మిగతా హీరోయిన్లు మేల్కొంటున్నారు. దీంతో సీనియర్ వర్సెస్ జూనియర్ హీరోయిన్స్ అన్న పోటీ మొదలైంది.
అయితే ఓటీటీ ఫ్లాట్ ఫాంకు హద్దులు లేకపోవడంతో బోల్డ్ సీన్లకు సై అంటున్నారు హీరోయిన్లు. ఇటీవల వచ్చి కర్దాలో తమన్నా శృంగార సన్నివేశాల్లో నెవ్వరూ బిఫోర్ అన్నట్లు నటించింది. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఆ సీన్లలో ఆమెను చూసి నోరెళ్లబెట్టినవారే. ఇక ఈనెల 29న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ట్రెండ్ సృష్టిస్తున్న లస్ట్ స్టోరీస్ సీక్వెల్ లస్ట్ స్టోరీస్-2లో కూడా తమన్నా, మృణాల్ ఠాకూర్ నటించారు. అయితే తమన్నా మాత్రం కాస్త రెచ్చిపోయి నటించింది. అయితే మృణాల్ కూడా అటువంటి సీన్లలో నటించిందంటూ వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసి.. తమన్నాను మించిపోయేలా రొమాన్స్ సీన్స్ లో నటించిందంటూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు.
నాలుగు కథల మిళితమే లస్ట్ స్టోరీస్-2. ఇందులో నీనా గుప్తాతో కలిసి నటించింది. అయితే ఈ ఎపిసోడ్ నిండా సెక్స్‌కు సంబంధించిన పదాలే వినిపిస్తుంటాయి. పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ వంటి కొన్ని పదాలు గుజుప్పా కరంగా ఉంటాయి. అయితే ఇందులో బెడ్రూమ్ సీన్లో నటించిందని, అందులో హాట్ ఎక్స్ ప్రెషన్తో కుర్రకారును రెచ్చగొడుతుందంటూ ఓ సీన్ వైరల్ అవుతుంది. అయితే ఇది అంతా భావిస్తున్నట్లు లస్ట్ స్టోరీస్ -2 కాదు.. ఘోస్ట్ స్టోరీస్‌లో ఆమె ఈ సీన్లో నటించింది. దీన్ని కూడా లస్ట్ స్టోరీస్ నిర్మించిన వారే తీశారు. ఇది కూడా యాంథాలజీ మూవీనే. హార్రర్ నేపథ్యంలో ఇది రూపొందింది.