డాక్టర్ ‘కమ్’ సినీయాక్టర్ ‘కమ్’ న్యూట్రీషియన్ ‘కమ్’ మిల్లెట్ మార్వెల్స్ ఓనర్ : భరత్ రెడ్డి!

ఒక విచిత్రం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భరత్ – జల్సా, గగనం, అత్తారింటికి దారేది, రాజా ది గ్రేట్, డిస్కో రాజా లాంటి  చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ నటుడు మిల్లెట్ మార్వెల్స్ అనే రెస్టారెంట్ ను హైదరాబాద్ జుబ్లీ హిల్స్ లో ప్రారంభించారు. టేస్టిఫుల్లీ క్రాఫ్టెడ్ సూపర్ ఫుడ్ అనే క్యాప్షన్ తో ఈ రెస్టారెంట్ ప్రచారం ప్రారభించారు. హెల్దీ ఫుడ్ మన శరీరానికి ఎంతో అవసరం అనీ, దాన్ని రుచికరంగా మేం అందిస్తాం అంటున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైనా ప్రవృత్తిగా నటనను ఎంచుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఇంకా ఏదో వెలితి. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే వాళ్లలో 25 ఏళ్లు నిండకుండానే మధుమేహం బారిన పడటం ఆయనను ఎంతగానో కలిచివేసింది. ప్రజల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని తపించారు. మూలాలు వెతికారు. ఏడాదిన్నర పాటు శ్రమించారు. తాతముత్తాతలు తిన్న చిరుధాన్యాలే రేపటి తరానికి రక్షణగా నిలుస్తాయని గ్రహించి వాటితో వివిధ రకాల ఆహారాన్ని తయారు చేసి ప్రజలకు వడ్డిస్తున్నారు.

mcms

చిరుధాన్యాలతో తయారు చేసే వంటలను తినమని సలహా ఇచ్చేవారు. కొంత మంది తన సలహాలను పాటిస్తూ ఆరోగ్య వంతులయ్యేవారు. మరికొంత మందికి చిరుధాన్యాలతో ఎలా వంట చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన భరత్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్ సెంటర్’ సహకారంతో హైదరాబాద్‌లో చిరుధాన్యాలతో ఆహారం తయారు చేయాలని సంకల్పించారు.సోదరి ప్రోత్సాహంతో ఫిల్మ్ నగర్‌లో ‘మిల్లెట్ మార్వెల్స్’ పేరుతో తొలి కేంద్రాన్ని ప్రారంభించారు. ‘మిల్లెట్ మార్వెల్స్‌’లో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, కిన్వినా ఇలా ఆరు రకాలతో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. మిల్లెట్ మార్వెల్స్’ ద్వారా సుమారు 40 నుంచి 50 మందికి ఉపాధి కల్పించారు. ఫిల్మ్ నగర్‌తో పాటు మరో నాలుగు చోట్ల శాఖలను తెరిచారు. అన్ని ఆన్ లైన్ ఫుడ్ సర్వీసుల్లో అందుబాటులోకి రానున్న మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ సేవలు ప్రస్తుతం స్విగ్గీలో అందుబాటులో ఉన్నాయి.