అబద్ధం ఎదుటి వ్యక్తిని సంతోష పెడుతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ, అది కొన్ని సమయాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు చెప్పింది అబద్ధం అని ఎదుటి వ్యక్తికి తెలిసినపుడు నమ్మకం పోతుంది.
ఈ సమాజంలో నిజాయితీగా బతకటం చాలా కష్టం. ముఖ్యంగా ఏ విషయానికి అబద్ధాలు ఆడకుండా ఉండటం అన్నది ఒకరకంగా అసాధ్యం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ మనిషి ఏదో ఒక సమయంలో అబద్దాలు చెబుతాడు. అబద్ధాలు చెప్పకుండా ఓ మనిషి జీవితం పూర్తవదు అని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంతమంది సందర్భాన్ని బట్టి.. అవసరాన్ని బట్టి అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇంకా కొందరు ప్రతీ చిన్న విషయానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. దారుణం ఏంటంటే.. కొంతమందికి అబద్ధాలు చెప్పటమే ఓ పని. అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెబుతూ ఉంటారు.
కొందరు ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టడానికి.. అబద్ధాల రూపంలో జోక్స్ వేస్తూ ఉంటారు. వీళ్లు అబద్ధం ఆడుతున్నారని అవతలి వ్యక్తికి కూడా తెలుస్తుంది. నవ్వించటానికి చెప్పిన అబద్ధం కాబట్టి నవ్వి ఊరుకుంటారు. ఇంకా కొంతమంది బిల్డప్పుల కోసం అబద్ధం చెబుతూ ఉంటారు. లేని గొప్పతనాన్ని డప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. అవతలి వ్యక్తికి వీరు చెప్పేవి అబద్ధాలని కొన్నిసార్లు తెలుస్తుంది. కొన్ని సార్లు నిజమేనని నమ్మే అవకాశం కూడా ఉంటుంది. అబద్ధాలు చెప్పే వ్యక్తిని బట్టి అవి నిజాలుగానో.. అబద్ధాలుగానో మారుతూ ఉంటాయి.
వాస్తవానికి రిలేషన్‌లో ఉన్న వారి మధ్య అబద్ధాలు చిచ్చు పెడతాయి. రిలేషన్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో అందంగా కనిపించిన అబద్ధాలు తర్వాత చేదు విషంగా మారతాయి. అబద్ధాల హద్దులు దాటితే రిలేషన్ ప్రమాదంలో పడిపోతుంది. అలా ఎన్నో సమస్యలకు.. కొన్ని సంతోషాలకు కారణం అవుతున్న అబద్ధం గురించి చెబుతూ పోతే ఎంతైనా ఉంది. ఈ విషయాల గురించి పక్కన పెడితే.. అసలు మన ఇండియాలో ఎక్కువ మంది ఏ ఏ విషయాల్లో ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారో మీకు తెలుసా?..