ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతోంది. కార్డుపై అదిరిపోయే బెనిఫిట్స్ అందించబోతోంది. ఇది స్విగ్గీ నుంచి రాబోతున్న మొట్టమొదటి క్రెడిట్ కార్డు.
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఇంట్లో వంట చేసుకునే సమయంలేని వారు ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఉన్నచోటుకే భోజనం తెప్పించుకుని ఆకలి తీర్చుకుంటున్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ, జొమాటో కు ఉన్న క్రేజే వేరు. నిత్యం వందలాది ఆర్డర్లతో కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు శుభవార్తను అందించింది. ఇక నుంచి కస్టమర్లకోసం స్విగ్గీ క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. ఈ క్రెడిట్ కార్డులతో అదిరిపోయే ఆఫర్లను పొందొచ్చు. ఫుడ్ ఆర్డర్లు, నిత్యావసర వస్తువులపై క్యాష్ బ్యాక్ అందించనుంది. ఆ వివరాలు మీకోసం..
ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్ల హవా నడుస్తోంది. కొందరు ఫోన్ పే, గూగుల్ పేతో చెల్లింపులు చేస్తుంటే, మరికొందరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వివిద బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులను మాత్రమే వినియోగించినం. కానీ ఇప్పుడు స్విగ్గీ నుంచి క్రెడిట్ కార్డులు రాబోతున్నాయి. స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో కలిసి క్రెడిట్ కార్డును ప్రారంభించింది. దీనిని ఉపయోగించి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినపుడు మీరు చెల్లించిన మొత్తంపై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతర ఈ కామర్స్ వెబసైట్స్ ద్వారా కొనుగోలు చేసినపుడు 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇతర ఖర్చులపై కూడా 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకునే కస్టమర్లు మూడు నెలల పాటు Swiggy One ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. వీటిలో ఉచిత ఫుడ్ డెలివరీ, డైన్‌అవుట్, స్విగ్గీ జెనీ, ఇన్‌స్టామార్ట్ కూడా ఉన్నాయి. అర్హులైన వారందరూ స్విగ్గీ యాప్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ. 500 రూపాయలు. వార్షిక రుసుము రూ. 500 చెల్లించాలి. సంత్సర కాలంలో కొనుగోల్ల ఖర్చులు రూ. 2 లక్షలు దాటినపుడు ఆ రుసుం తిరిగి కస్టమర్లకు చెల్లిస్తుంది.
HDFC Bank launches co-branded credit card with Swiggy.
Read below to know more.#HDFCBank #News pic.twitter.com/tg1DutvxE5
— HDFC Bank News (@HDFCBankNews) July 26, 2023